ETV Bharat / business

యూనికార్న్ హబ్​గా భారత్​.. టాప్​లో ఆ నగరం!

India startup unicorns 2022: అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్‌లు ఉన్న దేశంగా భారత్‌ ఆవిర్భవించనున్నట్లు ఆస్క్ వెల్త్​, హ్యూరన్ ఇండియా సంస్థలు సంయుక్తంగా​ నివేదికను విడుదల చేశాయి. దేశంలోని అంకుర సంస్థల్లో వందకు పైగా త్వరలోనే యూనికార్న్‌ స్థాయికి చేరనున్నట్లు వెల్లడైంది. బెంగళూరుకు చెందిన 46 అంకురాలు యూనికార్న్‌ అంచనా జాబితాలో ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

india startups unicorns
హ్యూరన్‌ ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2022
author img

By

Published : Jun 30, 2022, 8:44 AM IST

India startup unicorns 2022: దేశంలోని అంకుర సంస్థల్లో వందకు పైగా త్వరలోనే యూనికార్న్‌ స్థాయికి చేరనున్నట్లు 'హ్యూరన్‌ పరిశోధన సంస్థ' సమీక్షలో వెల్లడైంది. ఆస్క్‌ వెల్త్‌, హ్యూరన్‌ ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌- 2022ను బుధవారం బెంగళూరులో విడుదల చేశారు.

అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్‌లు ఉన్న దేశంగా భారత్‌ ఆవిర్భవించనున్నట్లు ఆస్క్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ సీఈఓ రాజేశ్‌ సలూజా, హ్యూరన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ ఈ సందర్భంగా చెప్పారు. 1 బిలియన్‌ డాలర్లు (రూ.7,892 కోట్ల) విలువకు చేరుకున్న సంస్థను యూనికార్న్‌గా పరిగణిస్తారు. దేశంలో 2000 తర్వాత ప్రారంభించి 200 మిలియన్‌ డాలర్లు- 1 బిలియన్‌ డాలర్ల మధ్య వ్యాపార సామర్థ్యం కలిగి, పబ్లిక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో లేని స్టార్టప్‌లను సమీక్షించారు. వీటిని రెండేళ్లలో యూనికార్న్‌ స్థాయికి చేరే గజెల్స్‌ (జింక), నాలుగేళ్లలో చేరే చీతా (చిరుత)లుగా వర్గీకరించారు. ఈ అంకురాల వ్యాపార, ఉత్పాదన ప్రగతి స్థిరంగా కొనసాగితే రానున్న మూడు నాలుగేళ్లలో 122 అంకురాలు యూనికార్న్‌ స్థాయికి చేరతాయని నివేదిక స్పష్టం చేసింది. వీటి ప్రస్తుత విలువ 49 బిలియన్‌ డాలర్లని, గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం పెరిగిందని పేర్కొంది.

బెంగళూరు టాప్‌: బెంగళూరుకు చెందిన 46 అంకురాలు యూనికార్న్‌ అంచనా జాబితాలో ఉన్నాయి. దిల్లీ నుంచి 25, ముంబయి నుంచి 16 స్టార్టప్‌లకూ దీనిలో చోటు దక్కింది. ఈ అంకురాల్లో అత్యధికం (27) ఫిన్‌టెక్‌వి కాగా.. తర్వాత ఈ-కామర్స్‌ (14), సాఫ్ట్‌వేర్‌ సేవలు (11), ఎడ్యుటెక్‌ (7) ఉన్నాయి. భవిష్యత్తు యూనికార్న్‌ వ్యవస్థాపకుల్లో అత్యధికులు (22) ఐఐటీ దిల్లీ పట్టభద్రులు కాగా తర్వాత స్థానాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ (18), ఐఐటీ ముంబయి (18), ముంబయి వర్సిటీ (17), బిట్స్‌ పిలానీ(14) ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇవీ చదవండి: ముడి చమురు విక్రయంలో ఆ సంస్థలకు స్వేచ్ఛ!

బీచ్​లో కాలక్షేపానికి రూ.5లక్షల కోట్ల కంపెనీ వీడిన సీఈఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.