ETV Bharat / business

జీడీపీ వృద్ధి డౌన్.. క్యూ3లో 4.4 శాతమే! - జీడీపీ వృద్ధి రేటు భారత్

దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 28, 2023, 6:55 PM IST

Updated : Feb 28, 2023, 7:12 PM IST

2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నెమ్మదించింది. తయారీ రంగంలో వృద్ధి పడకేయడం వల్ల దేశ జీడీపీపై ప్రభావం పడింది. ఫలితంగా అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతానికి పరిమితమైంది. స్థిర ధరల వద్ద జీడీపీ విలువ క్యూ3లో రూ.40.19 లక్షల కోట్లకు చేరిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) లెక్కగట్టింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 11.2 శాతం నమోదైనట్లు ఎన్ఎస్ఓ గుర్తు చేసింది. 2022 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.3 శాతం నమోదైనట్లు వెల్లడించింది.

తయారీ రంగం గతేడాది క్యూ3లో 1.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా.. ఈసారి త్రైమాసికంలో 1.1 శాతం క్షీణించిందని ఎన్ఎస్ఓ డేటా వెల్లడించింది. వ్యవసాయ రంగం 3.7 శాతం వృద్ధి చెందిందని, గతేడాది క్యూ3లో ఇది 2.2 శాతంగా నమోదైందని తెలిపింది. మైనింగ్ రంగం 3.7 శాతం, క్వారీ రంగం 5.4 శాతం వృద్ధి నమోదు చేశాయి. నిర్మాణ రంగం ఏకంగా 8.4 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయానికి ఈ రంగం వృద్ధి రేటు 0.2 శాతానికే పరిమితమైంది. సేవా రంగం వృద్ధి రేటు గతేడాది క్యూ3లో 9.2 శాతం కాగా.. ఈ సారి అది 9.7 శాతానికి పెరిగింది.

ఏడు శాతం వృద్ధి!
ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతంగా నమోదవుతుందని జాతీయ గణాంక కార్యాలయం తన రెండో ముందస్తు అంచనాల్లో పేర్కొంది. అదే విధంగా 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధిని సవరించింది. గతంలో 8.7 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఎన్ఎస్ఓ వెల్లడించింది. అయితే దీన్ని 9.1 శాతానికి మార్చుతూ ప్రకటన చేసింది.

ద్రవ్యలోటు ఇలా..
మరోవైపు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలానికి ద్రవ్యలోటు రూ.11.9లక్షల కోట్లుగా లెక్కతేలినట్లు 'కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్' (సీజీఏ) తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా నమోదు కావొచ్చని సీజీఏ అంచనా వేసింది. ఇది జీడీపీలో 6.4 శాతానికి సమానమని తెలిపింది. అధిక వ్యయాలు, ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం వల్ల ప్రస్తుతం ద్రవ్యలోటు పెరిగినట్లు తెలుస్తోంది.

తొలి 10 నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.16,88,710 కోట్లుగా నమోదైనట్లు సీజీఏ డేటా వెల్లడించింది. ఇది సవరించిన అంచనాలలో 80.9 శాతానికి సమానమని పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి రాబడి అంచనాలలో 87.7 శాతం ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అయితే, 2023-24 నాటికి ద్రవ్యలోటును 5.9 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 నాటికి దీన్ని 4.5 శాతానికి తీసుకురావాలని భావిస్తోంది.

ఇదీ చదవండి:

మార్చిలో బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే..

దటీజ్​ మస్క్.. సంపన్నుల జాబితాలో మళ్లీ టాప్.. 2 నెలల్లోనే..

Last Updated : Feb 28, 2023, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.