India GDP Growth Rate 2023 : 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ అంచనాలకు మించి వృద్ధి నమోదు చేసింది. ఈ కాలానికిగాను జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.2గా నమోదైంది. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు 4.5 శాతంగా నమోదుకాగా.. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో అది 6.1 శాతానికి చేరింది.
2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 4 శాతంగా ఉంది. ఐతే 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధిరేటు 9.1 శాతంగా నమోదైంది. 2022-23 చివరి త్రైమాసికంలో వ్యవసాయ, ఉత్పత్తి, మైనింగ్, నిర్మాణ రంగాలు మెరుగైన పురోగతి సాధించాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) ఈ మేరకు డేటా విడుదల చేసింది. 2022-23లో వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని అంచనాలు ఉండగా అది 7.2 శాతానికి చేరింది. 2023 తొలి మూడు నెలల్లో చైనా వృద్ధిరేటు 4.5 శాతంగా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే ఉత్పత్తి రంగం 0.6 శాతం పెరిగి 4.5 శాతానికి చేరుకుంది. మైనింగ్ రంగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2.3 గా నమోదైంది. నిర్మాణ రంగం గతేడాదిలో 4.9 శాతం ఉండగా.. ఈ త్రైమాసికంలో 10.4 వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం రంగం 4.1 శాతం నుంచి 5.5 శాతానికి ఎగబాకింది.
-
Fantastic news!
— MyGovIndia (@mygovindia) May 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India's growth for FY 2022-23 is above 7%, making it the fastest-growing economy among major economies worldwide.#GDP #NewIndia #TransformingIndia pic.twitter.com/NT0JRq0YrM
">Fantastic news!
— MyGovIndia (@mygovindia) May 31, 2023
India's growth for FY 2022-23 is above 7%, making it the fastest-growing economy among major economies worldwide.#GDP #NewIndia #TransformingIndia pic.twitter.com/NT0JRq0YrMFantastic news!
— MyGovIndia (@mygovindia) May 31, 2023
India's growth for FY 2022-23 is above 7%, making it the fastest-growing economy among major economies worldwide.#GDP #NewIndia #TransformingIndia pic.twitter.com/NT0JRq0YrM
ఈ ఏడాది ద్రవ్యలోటు 17.33 లక్షల కోట్లు
Current Deficit Of India : మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 6.4గా నమోదైంది. ఈ మేరకు డేటాను విడుదల చేసింది కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.71 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.33 లక్షల కోట్లుగా సీజీఏ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి మొత్తం రూ. 24.56 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఇందులో రూ. 20.97 లక్షల కోట్లు పన్ను రూపంలో.. రూ. 2.86 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం, రూ.72,187 కోట్లు రుణేతర మూలధనం ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం రూ. 41.89 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. అందులో రూ. 34.52 లక్షల కోట్లు రెవెన్యూ ఖాతాలో, రూ. 7.36 లక్షల కోట్లు మూలధన ఖాతాలో ఉన్నాయని వెల్లడించింది.
ఇవీ చదవండి : జీడీపీ వృద్ధి డౌన్.. క్యూ3లో 4.4 శాతమే!
2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7%!.. గతేడాది కంటే ఇది తక్కువే..!