Hyundai Exter SUV Launch : కొరియన్ కంపెనీ హ్యుందాయ్ సోమవారం ఇండియన్ మార్కెట్లో హ్యూందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీని లాంఛ్ చేసింది. అదిరే ఫీచర్లతో, స్పెసిఫికేషన్స్‌తో మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీగా దీనిని తీసుకొచ్చింది. ఇది నేరుగా టాటా పంచ్, సిట్రోయెన్ సీ3తో పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకునే వీలుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ స్పెసిఫికేషన్స్
Hyundai Exter Specifications : హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ డిజైన్ యూనిక్‌గా ఉంది. దీనిలో 1.2 లీటర్ VTVT NA పెట్రోల్ ఇంజిన్ ఉంది. వాస్తవానికి ఈ ఇంజిన్‌ను హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ, ఐ20, ఐ10, నియోస్ కార్లలో ఉన్నదే. ఈ ఇంజిన్ 81.86 పీహెచ్‌పీ పవర్, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, ఏఏంటీ ట్రాన్స్ మిషన్ ఉంది.
Hyundai Exter SUV Mileage : హ్యూందాయ్ ఎక్స్టర్ లీటర్‌కు 19.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రూ.7.96 లక్షలు ధర కలిగిన హ్యుందాయ్ ఎక్స్టర్ కారు 19.2 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఫీచర్స్
Hyundai Exter Features : హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX(O), Spec SX(O) అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీలో తొలి సన్‌రూఫ్ కారు ఇదే. ఇది వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కావడం విశేషం. ఇంకా ఈ కారులో 4.2 అంగుళాల డిజిటల్ డిస్ప్లే, 8 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫొటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిండ్ ఆటో, సెమీ డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. దీనిలోని బుట్ స్పేస్ 391 లీటర్లు ఉంది. అంటే ఇది ఎంతో విశాలంగా లగేజ్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
సెఫ్టీ ఫీచర్స్:
Hyundai Exter Safety Features : హ్యుందాయ్ ఎక్స్టర్లో సేఫ్టీ కోసం 8 ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, సీట్‌బెల్ట్ రిమైండర్, థెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఈఎస్ఎస్, పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఊబీడీ .. అలాగే ఫ్రంట్, రియర్ కెమెరాలతో కూడిన డాష్కామ్ కూడా దీనిలో ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్టర్ వీల్‌బేస్ 2,450mm, ఎత్తు 1,631mmగా ఉంది. అందువల్ల మంచి ఎత్తుతో, డ్రైవింగ్ కంఫర్ట్, లెగ్ స్పేస్‌తో ఈ ఎస్యూవీ చాలా సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ అవుట్డోర్, ట్రావెల్ డ్రైవ్‌లకు చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ ధర ఎంత?
Hyundai Exter Price : హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్-షోరూం ధర)గా నిర్ణయించారు. దీనిలోని హై-ఎండ్ మోడల్ ధర రూ.9.31 లక్షలు (ఎక్స్-షోరూం ధర). హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ ట్రిమ్ కారు ధర రూ.8.23 లక్షలుగా ఉంది.