ETV Bharat / business

Group Policy To Single Policy : కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. ఉద్యోగం మానేశాక కూడా కొనసాగాలంటే? - What Is Group Health Policy In Telugu

How To Shift From Group Policy To Single Policy : చాలా సంస్థలు తమ ఉద్యోగి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్​ హెల్త్​ పాలసీలను ఆఫర్​ చేస్తుంటాయి. అయితే ఈ పాలసీ అతడు లేదా ఆమె ఆ కంపెనీలో పనిచేసేంత వరకే వర్తిస్తాయి. తర్వాత రద్దవుతాయి. మరి అలాంటి సమయాల్లో కూడా ఈ రకం పాలసీలను మన ఇండివిజువల్​ పాలసీగా మార్చుకునేందుకు ఛాన్స్​ ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Shift From Joint Policy To Single Policy
Joint Policy To Single Policy Full Details In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 4:20 PM IST

How To Shift From Group Policy To Single Policy : ఆరోగ్య బీమా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అవసమైన బీమా పథకాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని బృంద ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తుంటాయి. అయితే ఈ రకమైన పాలసీలు సదరు ఉద్యోగి ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం వరకే వర్తిస్తాయి. ఆ తర్వాత రద్దవుతాయి.

ఒకవేళ ఉద్యోగం మారాల్సి వచ్చినా, పదవీ విరమణ చేసినా, కంపెనీయే ఈ సౌలభ్యాన్ని ఆపేసినా మీకు మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత దూరమైనట్లే. అలాంటి సందర్భాల్లోనే మీరు తీసుకునే ఓ నిర్ణయం మీకు, మీ కుటుంబానికి ఉన్న ఆరోగ్య భద్రత కొనసాగేలా చేస్తుంది. అదే గ్రూప్​ హెల్త్ పాలసీ నుంచి ఇండివిజువల్​ పాలసీలోకి( Apply Group Policy To Single User ) మారడం. అవును ఇలా మరేందుకు అవకాశం కల్పిస్తున్నాయి బీమా కంపెనీలు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం.

బృంద ఆరోగ్య పాలసీ అంటే ఏమిటి?
What Is Group Health Policy : బృంద బీమా పాలసీ లేదా గ్రూప్​ పాలసీ మీతోపాటు మీ కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పిస్తాయి. ఇలాంటి సమయాల్లో దీనిని ఫ్యామిలీ ఫ్లోటర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఒక్కరికే వర్తిస్తే గనుక.. వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్లాన్‌కు మారవచ్చు. బృంద ఆరోగ్య బీమా నుంచి వ్యక్తిగత పాలసీగా మార్చుకోవాలనుకుంటే ముందుగా ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయాలి. పాలసీ పునరుద్ధరణకు 45 రోజుల ముందే ఈ విషయాన్ని సంబంధిత బీమా సంస్థకు చెప్పాలి. అప్పుడైతేనే పాలసీని సులభంగా పోర్ట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇండివిజువల్​ పాలసీకి మారితే కలిగే లాభాలు!
Benefits Of Group Policy To Individual Policy : గ్రూప్​ హెల్త్​ పాలసీని ఇండివిజువల్​ పాలసీగా మార్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సదరు సంస్థలో మీరు ఉద్యోగం మానేసినా, పదవీ విరమణ చేసినా, సంస్థ పాలసీని ఆపేయాలని నిర్ణయించినా ఇలా పలు సందర్భాల్లో మీకు అందే బీమా రక్షణను కోల్పోతారు. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు బృంద పాలసీ నుంచి సొంత పాలసీకి మారడం ఎంతో దోహదం చేస్తుంది.

ఒకవేళ మీరు కొత్త పాలసీ తీసుకోవాలన్నా మళ్లీ 3 నుంచి 4 ఏళ్లపాటు వేచి ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మీ సమయం వృథా అవుతుంది. కాగా, ఇప్పటికే మీరు బృంద పాలసీలో కొన్నాళ్లు ఉండి బయటకు వస్తారు కాబట్టి ఈ వెయిటింగ్​ పీరియడ్​ కలిసొస్తుంది. ఉదాహరణకు ఒక గ్రూప్​ పాలసీలో నాలుగేళ్ల పాటు వేచి ఉండే విధంగా టైమ్​ లిమిట్​ ఉందనుకుందాం. అప్పటికే బృంద పాలసీలో మీరు మూడేళ్లు కొనసాగి.. సొంత పాలసీకి మారితే గనుక కేవలం ఏడాది పాటే మీరు వేచి ఉంటారు. ఇలా మీ సొంత పాలసీ కాల వ్యవధి తగ్గుతుంది.

ఇక ఈ బృంద పాలసీలు ఒకే విధమైన బీమా అవసరాలున్న వ్యక్తుల సమూహానికి రక్షణ కల్పిస్తాయి. కాగా, వ్యక్తిగత పాలసీకి మారడం వల్ల మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మీ కవరేజీ లిమిట్​ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. బృంద పాలసీల్లో కొన్ని చికిత్సలకు మినహాయింపులు వర్తిస్తాయి. అదే రీటైల్​ పాలసీల్లో చాలా తక్కువ మినహాయింపులు ఉంటాయి.

మారే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
Limits Of Group Policy Shifting To Retail Policy :

ఆ సమయంలో వైద్య పరీక్షలు కోరవచ్చు!
గ్రూప్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ అందిస్తున్న సంస్థలో మాత్రమే వ్యక్తిగత పాలసీకి మారేందుకు వీలుంటుంది. సాధారణంగా బృంద ఆరోగ్య బీమా పాలసీలకు ఆరోగ్య పరీక్షల అవసరం ఉండదు. కానీ, పోర్టింగ్‌ చేసే సమయాల్లో మాత్రం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు.

వెంటనే అమల్లోకి రాదు!
చాలావరకు పాలసీ హోల్డర్లు ఇలా బృంద పాలసీ నుంచి సొంత పాలసీకి మారే క్రమంలో బీమా ప్లాన్​ లిమిట్​ను పెంచేందుకు మొగ్గు చూపిస్తారు. అయితే ఇలా పెంచిన మొత్తం వెంటనే అమల్లోకి రాదని గుర్తుంచుకోండి. సాధారణంగా వేచి ఉండే వ్యవధి పూర్తయ్యాకే మీరు పెంచిన మొత్తానికి ఈ నిబంధన వర్తిస్తుంది.

ఉదాహరణకు మీరు రూ.5 లక్షల బృంద పాలసీని తీసుకున్నారు అనుకుందాం. ఈ పాలసీ నుంచి రీటైల్​ పాలసీకి మారిన తర్వాత దీనిని రూ.10 లక్షలకు పెంచారు. అయితే అప్పుడు పెరిగిన రూ.5 లక్షల కోసం వేచి ఉండే కాల వ్యవధి పూర్తవ్వాలి. అప్పుడే మీరు పెంచిన మిగతా రూ.5 లక్షలు అమల్లోకి వస్తాయి.

నోట్​ : చివరగా గ్రూప్​ పాలసీల నుంచి సొంత పాలసీలకు మారే ముందు కొత్త పాలసీకి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులను సవివరంగా తెలుసుకోండి. వాటిని అధ్యయనం చేయండి. లేదంటే క్లెయిం చేసుకునే సమయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బీమా కంపెనీ హెల్ప్​లైన్​ సెంటర్​ను సందర్శించి మీ అనుమానాలను నివృతి చేసుకోవచ్చు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.