ETV Bharat / business

వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందా? ఈ సింపుల్​ ట్రిక్స్​​తో భారం తగ్గించుకోండి - tips to reduce bike insurance

How To Reduce Motor Insurance Premium : ప్రస్తుత కాలంలో వాహనం నడిపే ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సిన వాటిల్లో వాహన బీమా ఒకటి. దురదృష్టవశాత్తు మన వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు మనల్ని ఆర్థికంగా రక్షించేవి ఇవే. అయితే కొన్నిసార్లు వీటికి అధిక మెుత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చాలామంది వాహనదారులు వాపోతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా తక్కువ ధరకే మీ వెహికిల్​ ఇన్సూరెన్స్​ను పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

5 Ways to Save Money while Renewing Your Car and Bike Insurance Online
How To Reduce Motor Insurance Premium
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 4:45 PM IST

How To Reduce Motor Insurance Premium : వాహనం కొనుగోలు చేసేటప్పుడే తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిల్లో వాహన బీమా ఒకటి. ఈ పాలసీని తీసుకోవటం వల్ల అనుకోకుండా మన వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మొత్తాన్ని సదరు బీమా సంస్థ భరిస్తుంది. అంటే మనం నష్టపోయిన డబ్బును పరిహారంగా చెల్లిస్తుంది. అయితే కొన్నిసార్లు వీటికి కట్టే ప్రీమియం అధిక మొత్తంలో ఉండటం వల్ల చాలామంది వాహనదారులకు ఇది ఆర్థిక భారంగా మారుతుంది. అయితే ఆఫ్​లైన్​ కంటే ఆన్​లైన్​లోనే ఈ పాలసీలను తీసుకోవటం లేదా రెన్యూవల్ చేయించటం ద్వారా కొంత తక్కువ మొత్తానికే వీటిని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు ప్రత్యేకమైన ఆపర్లను సైతం ప్రకటిస్తుంటాయి ఇన్సూరెన్స్​ కంపెనీలు. వీటిని తెలుసుకోవటం ద్వారా తక్కువ ధరకే పాలసీలను పొందే వీలుంటుంది. మరి ఈ సౌలభ్యాన్ని పొందాలంటే మీరు తప్పక అనుసరించాల్సిన ఆ ఐదు విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

పాలసీలను పోల్చి చూడండి
మీరు ఆఫ్​లైన్​లో పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నవాటితో పోల్చి చూడండి. ఇలా చేయటం ద్వారా కొత్త పాలసీలు అవి అందించే కవరేజ్​ అంశాలపై అవగాహన వస్తుంది. ఇలా చేయడం వల్ల మనం కట్టే ప్రీమియం ఖర్చు తగ్గటమే కాకుండా అదనపు కవరేజీలున్న మంచి పాలసీని మనం ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్​లో పాలసీల మధ్య తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి మనకు తక్కువ రేటులో లభించే ఇన్సూరెన్స్​ ఏదో తెలుసుకొని దానిని కొనుగోలు చేయడం ఉత్తమం.

నో క్లెయిమ్​ బోనస్​
మీ గత పాలసీకి సంబంధించి ఒకవేళ మీరు ఎటువంటి క్లెయిమ్​ను పొందనట్లయితే మీ పాలసీ రెన్యూవల్​ సమయంలో భారీ తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా ఇన్సూరెన్స్​ సమయంలో ఎటువంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు బీమా కంపెనీలు ఈ రకమైన ఆఫర్లను అందిస్తుంటాయి.

బీమా ప్రమోషన్​లను తెలుసుకోండి
వాహన బీమా కంపెనీలు తమ ప్లాన్​లను ప్రమోషన్​ చేసే సమయంలో భారీ తగ్గింపులు వాహనదారులకు అందిస్తుంటాయి. ఆన్​లైన్​లో వీటిపై ఓ దృష్టి పెట్టండి. ఈ ఆఫర్లు క్యాష్​బ్యాక్​లు, డిస్కౌంట్​లు ఏ రూపంలోనైనా ఉండవచ్చు. సాధారణంగా ఈ రకం ఆఫర్లు ఎక్కువ శాతం ఆన్​లైన్​లోనే అందుబాటులో ఉంటాయి. కనుక బీమా కంపెనీల వైబ్​సైట్​లను, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను తరచు చెక్​ చేస్తూ ఉండండి.

ఒకే కంపెనీ దగ్గర తీసుకొండి
చాలావరకు ఇన్సూరెన్స్​ కంపెనీలు వివిధ రకాలైన పాలసీ​లకు కలిపి ప్రత్యేక మినహాయింపుల్ని అందిస్తాయి. అందువల్ల ఫోర్​ వీలర్​, టూ వీలర్​, ఇల్లు వీటన్నింటికీ కలిపి ఒకే కంపెనీ వద్ద పాలసీలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల ప్రత్యేకమైన రాయితీలను పొందవచ్చు. ఈ విధంగా డిస్కౌంట్స్​ ఇచ్చే కంపెనీలను వెతకండి. ఈ పద్ధతి ద్వారా మీకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా మీ అన్ని పాలసీలను ఒకే ప్లాట్​ఫామ్​పై ​​చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

దీనిని పెంచుకోండి
మీరు కారు లేదా బైక్​కు ఇన్సూరెన్స్​ చేసే సమయంలో మీరు చెల్లించే కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్​ సంస్థ క్లైయిమ్ పరిగణలోకి తీసుకోదు. దీనిని వాలంటరీ డిడెక్టబుల్ అంటారు. దీనిని ఎంచుకోవటం ద్వారా మీ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గుతుంది. అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లించే విధంగానే డిడెక్టబుల్ ఆఫ్షన్​ను ఎంచుకోండి.

విదేశాల్లోనూ గూగుల్​ పే సేవలు- తగ్గనున్న ఛార్జీల భారం

బ్యాంకు రుణాలపై ఎన్నో ఛార్జీలు- ఏ లోన్​పై ఎంత వేస్తారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.