ETV Bharat / business

How To Reduce Expenses And Save Money : పండగ షాపింగ్ చేస్తున్నారా?.. ఖర్చులు తగ్గించుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 4:05 PM IST

How To Reduce Expenses And Save Money : దసరా పండుగ వచ్చేస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ వెబ్​సైట్స్ భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మరి మీరు కూడా భారీగా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఖర్చులను ఎలా గణనీయంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-reduce-expenses-and-save-money
ఖర్చులను తగ్గించడం ఎలా

How To Reduce Expenses And Save Money : మరి కొద్ది రోజుల్లో పండగలు రానున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఎక్కడ చూసినా రాయితీల సందడే నెలకొంది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఆందోళన కలిగిస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల రుణాలు సైతం భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'ఈ రోజు అవసరం లేని వస్తువులు కొంటే.. రేపు అవసరమైన వాటికి అమ్ముకోవాల్సి వస్తుంది.' వృథా ఖర్చులకు నేడు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్‌ లక్ష్యాలు దెబ్బతింటాయి' అనేది ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట. ఈ నేపథ్యంలోనే వ్యయ నియంత్రణ పాటించేందుకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు..
ఈ సూత్రం ఆర్థిక విషయాల్లో చాలా కీలకం. జీతం వచ్చిన వెంటనే ఖాతాలో ఉన్న డబ్బు మనల్ని ఊరిస్తుంటుంది. ఖర్చు చేసే విషయంలో కొంచెం కూడా ఆలోచించం. కానీ, నెల చివరి వారంలో చాలామంది చిన్న అత్యవసరం వచ్చినా ఆందోళన చెందుతుంటారు. సమయం, సందర్భాన్ని అనుసరించి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని ఏ మాత్రం తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడమనేది పొరపాటని తెలుసుకోవాలి. వృథా ఎక్కడ చేస్తున్నామో గమనిస్తే.. పొదుపు పెరుగుతుందన్న సంగతి మర్చిపోవద్దు.

బడ్జెట్‌ వేసుకోండి..
ప్రతి ఖర్చుకూ కచ్చితంగా ఒక లెక్క ఉండాలి. బడ్జెట్‌.. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్న దానిపై బడ్జెట్‌ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అనే విషయాన్ని ముందే నిర్ణయించుకోండి. వచ్చిన బోనస్‌లో కనీసం 50-60 శాతం పెట్టుబడికి మళ్లించాలి. మిగతా మొత్తాన్ని మీ ఇష్టానుసారం ఖర్చు చేయండి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ ముందుగా 20-30 శాతం పొదుపు చేశాకే.. ఖర్చు చేయాలనే నిబంధన ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. 40 శాతానికి మించి బ్యాంకు వాయిదాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఖర్చుల కోసం ప్రత్యేక అకౌంట్​ను కేటాయించండి. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకున్నా, సెలవుల్లో విహార యాత్రకు వెళ్లినా అన్నీ మీ బడ్జెట్‌లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే, మీ పొదుపు మొత్తం తగ్గి, భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది.

భావోద్వేగాల అదుపు..
డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా అనేక సందర్భాల్లో ఉంటుంది. అందుకే జీవన ఖర్చుల కోసం డబ్బును ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఇది సాధారణ విషయమే అనుకున్నా.. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువులను , ఖరీదైన దుస్తులను కొనడం లాంటి.. అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలి అనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవడం మంచిది

కార్డు అవసరమైతేనే..
పండగల వేళ క్రెడిట్‌ కార్డ్​ కొనుగోళ్లపై వివిధ రకాల అదనపు రాయితీలు ఉంటాయి. వాస్తవానికి వ్యాపార సంస్థలు తమ విక్రయాలను పెంచుకునేందుకు ఇలాంటి పద్ధతిని అవలంభిస్తూ ఉంటాయి. ఇది మనకు ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నది చూసుకోవాలి. అంతేకానీ, రాయితీలు ఇస్తున్నారు కదా అని కొనుగోలు చేయడం మంచిది కాదు. క్రెడిట్​కార్డ్​ను పరిమితికి మించి వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే పండగల కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డును వినియోగించాలి. ఇప్పుడు కొని, తర్వాత బిల్లు చెల్లించకపోతే లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అపరాధ రుసుములు, వడ్డీలను చెల్లించాల్సి వస్తుంది. సిబిల్‌ స్కోరు సైతం దెబ్బతింటుంది. క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోవాలి. మరో విషయం.. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బై నౌ పే లేటర్‌)’ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించండి.

వాయిదా వేయండి..
ఒక వస్తువును ఇప్పుడే కొనాల్సిన అవసరం అంతగా లేకపోతే.. ఆ ఖర్చును కొన్ని రోజుల పాటు వాయిదా వేయండి. దీనివల్ల మీ అధిక వ్యయాలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. వాయిదా పద్ధతిలో కొన్నిసార్లు వస్తువులు కొంటుంటారు. ఇది కూడా అంత మంచిదేమీ కాదు. దీనికి బదులుగా చెల్లించాల్సిన వాయిదాలను రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకొని.. అనంతరం ఆ మొత్తం జమయ్యాకే వస్తువులను కొనడం మంచిది. ఫలితంగా అప్పుల బారిన పడకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.

ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే.. సరైన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించే వరకూ డబ్బును పొదుపు లేదా మదుపు చేయాలి. అందుకు వీలుగా ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. వాస్తవానికి ఇవన్నీ ఒక పద్ధతిలో జరగాలి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక ఎప్పుడూ ముఖ్యమని మర్చిపోకూడదు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక నగదు అవసరాలను గుర్తించి.. అందుకు అనుగుణంగానే ఖర్చు విధానాలను మార్చుకోవాలి. అప్పుడే ఆర్థికంగా విజయం సాధిస్తారు.

Amazon Prime Shopping Edition Plan : ఫ్లిప్​కార్ట్ VIP ప్లాన్​కు పోటీగా.. అమెజాన్​ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్​' ప్లాన్​.. స్పెషల్​ బెనిఫిట్స్ ఏమిటంటే?

Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : షాకింగ్ రేటు.. హ్యుందాయ్ ఐ10 కారు.. లక్ష రూపాయలకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.