ETV Bharat / business

కారు మైలేజీ పెంచుకోవాలా? ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎదురే ఉండదు!

How To Increase Car Mileage : కారు ఉన్న ప్ర‌తిఒక్కరూ మంచి మైలేజ్​ కోసం త‌హ‌త‌హ‌లాడుతుంటారు. మైలేజ్​ ఎక్కువ‌గా ఇచ్చే కార్ల‌నే కొనుగోలు చేయ‌డానికి ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే మీకు కూడా కారు ఉందా? అది త‌క్కువ మైలేజ్​ ఇస్తుంద‌ని దిగులు ప‌డుతున్నారా? కారు మైలేజ్ సామ‌ర్థ్యం పెంచేందుకు కొన్ని టిప్స్​ పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips To Follow For Increasing Car Mileage
How To Increase Car Mileage
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 2:07 PM IST

How To Increase Car Mileage : చాలామంది కారు డ్రైవర్లు తమ వాహనం ఎక్కువ మైలేజ్​ ఇవ్వాల‌ని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న నేప‌థ్యంలో అధిక మైలేజ్​ ఇచ్చే కార్ల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటున్నారు. అయితే కారు ఉండి, అది త‌క్కువ మైలేజ్ ఇస్తోందని బాధపడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్​తో మీ కారు మైలేజ్​ సామ‌ర్థ్యాన్ని సులువుగా పెంచుకోండి. (How To Get Mileage For Cars).

స్థిర‌మైన వేగం పాటించండి
చాలా మంది కారును స్టార్ట్​ చేసిన త‌ర్వాత వేగంగా వెళుతుంటారు. రహ‌దారుల‌పై అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇలా చేయ‌డం వ‌ల్ల అధికంగా ఇంధ‌న వినియోగం అవుతుంది. ఒక స్థిర‌మైన వేగాన్ని పాటించ‌డం వ‌ల్ల ఇంధ‌నం ఆదా అవుతుంది. స్మూత్​ డ్రైవింగ్​ ఇంధన వినియోగాన్ని ఆప్టిమైజ్​ చేస్తుంది. తద్వారా మీ కారు మైలేజీ పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా, ముఖ్యంగా హైవేల‌పై క్రూయిజ్​ కంట్రోల్​ను ఉప‌యోగించండి.

వ‌స్తువు బ‌రువు త‌గ్గించండి
కారులో అధికంగా వ‌స్తువులు ఉండ‌టం వ‌ల్ల కూడా ఎక్కువ ఇంధ‌నం ఖ‌ర్చ‌వుతుంది. అందుకని అన‌వ‌స‌ర‌మైన వ‌స్తువుల్ని వాహనంలో నుంచి తీసేయండి. అవ‌స‌రం లేన‌ప్పుడు విండోస్​, రూఫ్​ రాక్​ల‌ను మూసి ఉంచండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏరోడైన‌మిక్​ డ్రాగ్​ త‌గ్గుతుంది. ఫ‌లితంగా ఇంధ‌న వినియోగం త‌గ్గి కారు మైలేజ్​ పెరుగుతుంది.

టైర్ల‌లో త‌గినంత గాలి
తక్కువ గాలి ఉన్న టైర్లు రోలింగ్​ నిరోధకత, ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. అందుకని మీ కారు టైర్​లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అది కంపెనీ సిఫార‌సు చేసిన స్థాయిలో ఉండేటట్లు చూసుకోండి.

అన‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇంజిన్​ ఆఫ్​
కొన్నిసార్లు మ‌న‌కు పెద్ద‌గా అవ‌స‌రం లేకున్నా ఇంజిన్​ను ఆన్​లోనే పెట్టి ఉంచుతాం. దీని వ‌ల్ల అధిక ఇంధ‌న వినియోగం అవ్వడ‌మే కాకుండా అన‌వ‌స‌ర‌మైన ఉద్గారాలు వాహనం నుంచి వెలువ‌డుతాయి. అందుకే మీరు కారు పార్క్​ చేసినప్పుడు లేదా ఏదైనా ప‌ని మీద కాసేపు ఆపిన‌ప్పుడు ఇంజిన్​ను ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి.

ప్ర‌యాణాల్ని ప్లాన్​ చేసుకోండి
మీరు వెళ్లాల‌నుకునే ప్ర‌యాణాల్ని ముందుగానే ప్లాన్​ చేసుకోవడం వ‌ల్ల ఇంధ‌నంను ఆదా చేసుకోవ‌చ్చు. ఒకే ట్రిప్పులో రెండు మూడు ప‌నులు ఉండేలా చూసుకోండి. సుల‌భంగా, సమీప మార్గంలో వెళ్లేందుకు నావిగేష‌న్ అప్లికేష‌న్​లను వినియోగించండి. దీని వ‌ల్ల ట్రాఫిక్​ సమస్యలను కూడా అధిగమించవచ్చు.

అధిక వేగాన్ని నివారించండి
అధిక వేగంతో డ్రైవింగ్​ చేయడం వల్ల ఏరోడైనమిక్​ డ్రాగ్​ గణనీయంగా పెరుగుతుంది. అధికంగా ఇంధ‌నం ఖ‌ర్చ‌వ‌డం వ‌ల్ల దాని సామ‌ర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే ప‌రిమిత వేగంలోనే వాహ‌నాన్ని న‌డ‌పండి. భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయండి.

సరైన మోటార్​ ఆయిల్​ వాడకం
మంచి నాణ్య‌త, త‌క్కువ విస్కాసిటీ కలిగిన మోటార్​ ఆయిల్​ ఫ్యూయెల్​ ఎకాన‌మీని పెంచుతుంది. అందుకే మీ కారు ఓనర్ మాన్యువల్​లో పేర్కొన్న మోటార్​ ఆయిల్​ సిఫార్సు గ్రేడ్‌ను మాత్రమే ఉపయోగించండి.

రెగ్యుల‌ర్​ చెక‌ప్​ మస్ట్​
మీ వాహ‌నాన్ని రెగ్యుల‌ర్​గా చెక‌ప్​ చేయ‌డం తప్పనిసరి. ఆయిల్​ ఛేంజ్​, ఎయిర్​ ఫిల్టర్​ రీప్లేస్‌మెంట్‌లు, స్పార్క్​ ప్లగ్​ తనిఖీలు వంటి సాధారణ వాటిని రెగ్యుల‌ర్​ చెక‌ప్​ చేయించి మెయింటెయిన్‌ చేయాలి. బాగా మెయింటెయిన్‌ చేసిన కారు మ‌రింత సమ‌ర్థంగా ప‌నిచేస్తుంది.

అధిక బ్రేకింగ్ ఆప‌ండి
చాలామంది కారు స్పీడుగా న‌డిపి బ్రేక్స్​ ఎక్కువ‌గా వేస్తుంటారు. ఎక్కువ సార్లు బ్రేక్స్​ వేయ‌డం వ‌ల్ల అధిక ఇంధ‌నం ఖ‌ర్చ‌వుతుంది. ఫ‌లితంగా బ్రేక్స్​ వేసిన‌ప్పుడు ఇంధ‌న వినియోగం వ‌ల్ల ఉత్ప‌త్త‌యిన శ‌క్తి వృథా అవుతుంది. అందుకే ట్రాఫిక్​ ప‌రిస్థితుల్ని అంచ‌నా వేసి వాహ‌నం న‌డ‌పాలి. చివరగా ముందున్న వాహ‌నాల‌కు, మ‌న కారుకు మ‌ధ్య నిర్దిష్టమైన దూరాన్ని పాటించేలా చూసుకోండి.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

రైల్వే 'సూపర్‌' యాప్‌ - అన్ని సేవలు ఒకే చోట - ఇకపై టికెట్​ బుకింగ్​కు నో వర్రీస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.