ETV Bharat / business

How to Get Loan On Insurance Policy : మీకు డబ్బు అత్యవసరమా.. ఇన్సూరెన్స్​ పాలసీ ఉందా..?? - లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీలపై లోన్లు

How to Get Loan On Insurance Policy : జీవిత బీమా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది మ‌న‌కు అత్య‌వ‌స‌ర ఆరోగ్య ప‌రిస్థితి త‌లెత్తిన‌ప్పుడు.. అకాల మ‌ర‌ణం సంభ‌వించిన‌ప్పుడు.. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. అయితే.. ఈ లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీపై లోన్లు కూడా తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా..?

Loan On Insurance Policy
How to Get Loan On Insurance Policy
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 12:23 PM IST

How to Get Loan On Insurance Policy in Telugu : భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు కనీసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా కలిగి ఉన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనదని.. అటు ఆరోగ్య‌, ఇటు ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. పైగా దీర్ఘకాలికంగా మంచి రాబడి ప్రయోజనాన్ని, జీవిత బీమా కవరేజ్‌ను కూడా అందిస్తాయి. ఇవి మాత్రమే కాదు, ఎల్‌ఐసీ పాలసీపై రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ విషయం మీకు తెలుసా..? అత్యవసర పరిస్థితుల్లో, బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకునే బదులు LIC బీమా పాలసీపై రుణం తీసుకోవచ్చు. తద్వారా... చదువులు, ఇల్లు, పెళ్లి, విదేశాలకు వెళ్లడం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.అయితే.. LIC పాలసీపై లోన్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. దీని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Securing Your Future - Why Term Insurance Plans Matter : మీకు బీమా ఉందా..? టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా..??

ఏదైనా కంపెనీ నుంచి మీరు జీవిత బీమా కొనుగోలు చేస్తే.. దానిపై మీరు వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కూడా తన కస్టమర్లకు ఈ పర్సనల్ లోన్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బ్యాంకు నుంచి తీసుకునే వ్యక్తిగత లోన్​ కంటే ఇన్సూరెన్స్ పాలసీపై తీసుకునే పర్సనల్​ లోన్లలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఆరు నెలలో చెల్లించే మొత్తానికి ప్రస్తుతం 9 శాతం వడ్డీ రేటును విధిస్తోంది. మీ ఇన్సూరెన్స్ పాలసీని ఆధారంగా చేసుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ రుణాలను జారీ చేస్తుంటాయి. చాలా వరకు బ్యాంకులు మీ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై 80 శాతం నుంచి 90 శాతం వరకు రుణాలను జారీ చేస్తున్నాయి. కనీసం రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి.

SBI General Insurance New Health Policy : సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. అన్​లిమిటెడ్ రీఫిల్స్​.. 3X బెనిఫిట్స్​!

బీమాపై రుణం ఫీచర్స్​:

Features of Loan against Insurance:

  • అర్హత గల పాలసీలు(Eligible Policies): ఈ లోన్‌కి సంబంధించిన ముఖ్యమైన అవసరాలలో ఒకటి బీమా పాలసీలో సరెండర్ విలువ. సాధారణంగా, పాలసీ కనీసం మూడు సంవత్సరాలు యాక్టివ్‌గా ఉన్న తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది. రుణం కోసం పాలసీని తాకట్టు పెట్టడానికి, అది మెచ్యూరిటీ సమయంలో నగదు విలువను కలిగి ఉండాలి.
  • లోన్ మొత్తం అండ్​ పదవీకాలం(Loan Amount & Tenure): రుణగ్రహీతలు పాలసీ సరెండర్ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణాలను పొందవచ్చు. లోన్ కాలపరిమితి పెరిగేకొద్దీ, సరెండర్ విలువపై అందుబాటులో ఉన్న మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 12 నెలల వరకు రుణ పదవీకాలానికి 15 శాతం మార్జిన్‌ను నిర్వహిస్తుంది. ఇది సరెండర్ విలువలో 85 శాతం మాత్రమే పంపిణీ చేయబడుతుందని సూచిస్తుంది. ఈ మార్జిన్.. 24 నెలల లోపు రుణాలకు 75 శాతానికి, అలాగే 36 నెలల లోపు రుణాలకు 70 శాతానికి తగ్గుతుంది. SBI అనుమతించిన గరిష్ట రీపేమెంట్ కాలపరిమితి మూడేళ్లు.

ప్రయోజనాలు ఏమిటి..?

Benefits of Loan on Insurance: తక్కువ వడ్డీ రేట్లు(Low Interest Rates): సాధార‌ణంగా బీమా సంస్థ‌లు పాల‌సీ స‌రెండ‌ర్ విలువ‌లో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణాలు అందిస్తాయి. ఉదాహరణకి ఓ ఇన్వెస్ట‌ర్ రూ.10 ల‌క్ష‌ల విలువైన పాల‌సీ తీసుకుంటే దాని స‌రెండ‌ర్ విలువ 3 ల‌క్ష‌లు. అందులో వారికి సుమారు రూ.2.4 నుంచి రూ.2.7 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది. దీనికి వ‌డ్డీ రేట్లు సైతం ఆయా కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి. సాధార‌ణంగా ఇది 9 నుంచి 12 శాతం మ‌ధ్య‌లో ఉంటుంది. బీమా పాల‌సీల సాయంతో రుణాలు తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపడానికి ప్ర‌ధాన కార‌ణం వ‌డ్డీ రేట్లు. వ్య‌క్తిగ‌త రుణంతో పోలిస్తే.. ఇక్క‌డ త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉంటాయి. అదే వ్య‌క్తిగ‌త రుణంలో ఇవి 16 నుంచి 18 శాతం వ‌ర‌కు ఉంటుంది.

LIC Unclaimed Amount Check : పాత​ ఎల్​ఐసీ పాలసీ మీ దగ్గర ఉందా?.. బీమా మొత్తాన్ని ఇలా క్లెయిమ్ చేసుకోండి!

లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా.. (Loan Application Process) :

  • అదనపు కొలేటరల్ లేకపోవడం వల్ల బీమాపై రుణం కోసం దరఖాస్తు చేయడం సులభమైన ప్రక్రియ.
  • మీ పాలసీని కలిగి ఉన్న బ్రాంచ్‌కు వెళ్లాలి.
  • అక్కడ, రుణం కోసం దరఖాస్తు ఫారాన్ని నింపాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​తో పాటు పాలసీ బాండ్, అడ్రస్​ ప్రూఫ్​, ID ప్రూఫ్​, ఆధార్​, బ్యాంక్​ పాస్​బుక్​ జిరాక్స్​ను అక్కడి అధికారులకు సమర్పించాలి.
  • రుణదాతకు పాలసీ హక్కులను బదిలీ చేసే 'డీడ్ ఆఫ్ అసైన్‌మెంట్' కూడా అవసరం.
  • దీని తర్వాత, 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది. అనంతరం లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

పెట్టుబడిదారులు ఒక్క‌సారి లోన్ తీసుకున్న త‌ర్వాత.. పొందిన రుణం పాల‌సీపై ప్రీమియం చెల్లించడం కొన‌సాగించాలి. ప్ర‌తీ రుణం లాగే ఇక్క‌డ సైతం పాల‌సీ ట‌ర్మ్ లోపు త‌మ రుణాన్ని తిరిగి చెల్లించాలి. పాల‌సీదారులు రుణం చెల్లించే స‌మ‌యంలో అస‌లుతో పాటు వ‌డ్డీని సైతం చెల్లించ‌వ‌చ్చు. లేదా వ‌డ్డీ మాత్ర‌మే చెల్లించే స‌దుపాయం కూడా ఉంది. వ‌డ్డీ మాత్ర‌మే చెల్లించే సంద‌ర్భంలో.. సెటిల్​మెంట్ స‌మ‌యంలో క్లెయిమ్ మొత్తం నుంచి అస‌లు తీసేస్తారు.

Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ VS ట‌ర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెస్ట్ ఆప్షన్​?

How to Buy LIC E-Term Policy in Online : ఆన్​లైన్​లో ఎల్​ఐసీ ఈ-టర్మ్​ పాలసీ.. ప్రయోజనాలేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.