ETV Bharat / business

హోం లోన్​ త్వరగా మంజూరు కావాలా?.. అయితే ఇలా చేయండి! - home loan development authority

Home loan tips and tricks : ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల. అయితే వ్యక్తిగత రుణాలతో పోల్చుకుంటే, గృహ రుణాల మంజూరుకు పట్టే సమయం కాస్త అధికంగానే ఉంటుంది. మరి సాధ్యమైనంత త్వరగా హోమ్​ లోన్​ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

the ways to get home loan quickly
how to get home loan faster
author img

By

Published : Jun 23, 2023, 5:53 PM IST

Home loan tips and tricks : ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో.. సామాన్యులు హోమ్​ లోన్​ లేకుండా ఇంటి నిర్మాణం చేయడం అనేది సాధ్యం కాదు. వాస్తవానికి ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేసే రుణాల కంటే.. బ్యాంకులు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీ రేట్లు చాలా వరకు తక్కువగానే ఉంటాయి. కానీ బ్యాంకులు అంత సులువుగా గృహ రుణాలు మంజూరు చేయవు. ఒక వేళ చేసినా దానికి చాలా సమయం పడుతుంది. కనీసం 3 నుంచి 4 వారాల పాటు దరఖాస్తు ప్రాసెస్​ జరుగుతూ ఉంటుంది.

ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్ల వల్ల కూడా గృహ రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా, తొందరగా హోమ్​ లోన్​ మంజూరు కావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.

క్రెడిట్​ స్కోర్​
Home Loan Credit Score : బ్యాంకులు లేదా రుణ సంస్థలు ముందుగా చూసేది క్రెడిట్​ స్కోర్​నే. 750కి పైగా క్రెడిట్​ స్కోర్​ ఉంటే రుణార్హత ఉంది కనుక బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. అంతేకాదు.. అగ్ర శ్రేణి రుణ సంస్థల నుంచి బహుళ రుణ సదుపాయం కూడా పొందే వీలుంటుంది. అయితే మంచి క్రెడిట్​ స్కోర్​ సంపాదించడం ఒక్క రోజులో అయ్యే పనికాదు. మంచి క్రెడిట్​ స్కోర్​ సాధించడానికి కనీసం 3 నుంచి 24 నెలల వరకు పడుతుంది. అందుకే బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని మీరు అనుకుంటే.. కనీసం 2 నుంచి 3 ఏళ్ల ముందు నుంచే క్రెడిట్​ స్కోర్​ను పెంచుకునేందుకు ప్రయత్నించండి. కనీసం ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి మీ స్కోర్​ను చెక్ చేసుకోండి. ముఖ్యంగా క్రెడిట్​ కార్డ్​ బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్​ కార్డ్​ పరిమితిలో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే వాడుకోండి. మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. హోమ్​ లోన్ లాంటి పెద్ద మొత్తాలను రుణాలుగా పొందాలని అనుకుంటే.. ముందు చిన్న రుణాలను పూర్తిగా తీర్చేయండి.

జాయింట్ హోమ్​ లోన్​
Joint Home loan eligibility : మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ కలిసి హోమ్​ లోన్​ కోసం ప్రయత్నించడం మంచిది. సాధారణంగా సంపాదించే జీవిత భాగస్వామి విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇద్దరికీ ఆదాయాలు ఉన్నందున.. మీకు వేగంగా, అధిక మొత్తంలో గృహ రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ​దీనితో పాటు మహిళ సహ దరఖాస్తుదారుగా ఉంటే.. వడ్డీ రేటుపై రాయితీ కూడా లభిస్తుంది.

సుదీర్ఘ కాల వ్యవధితో..
Home loan repayment time : గృహ రుణాలు సాధారణంగా పెద్ద మొత్తంలో ఉంటాయి. కనుక వాయిదాలు కూడా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. ఇది సామాన్యులకు చాలా భారం అవుతుంది. అందుకే రుణ చెల్లింపు కాలవ్యవధి సుదీర్ఘంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈఎంఐల భారీ కాస్త తగ్గుతుంది. అది మీ దైనందిన ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.

బ్యాంకులు కూడా సుదీర్ఘ రుణాలను మంజూరు చేయడానికే ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే, దీని వల్ల నెలవారీ ఈఎంఐలు డిఫాల్ట్​ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాస్తవానికి మొదట్లో ఎక్కువ కాల వ్యవధికి రుణాలు తీసుకున్నా.. తరువాత మన దగ్గర డబ్బు సమకూరినప్పుడు తొందరగానే బ్యాంకు రుణం తీర్చడానికి కూడా అవకాశం ఉంది.

డాక్యుమెంట్స్​
Home loan documents : బ్యాంకు రుణం పొందాలంటే కచ్చితంగా సంబంధిత పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగానే బ్యాంకుల అధికారిక వెబ్​సైట్​ను చూసి, అవసరమైన డాక్యుమెంట్స్​ అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.

  • Home loan for government employees : ఉద్యోగుల విషయంలో పత్రాల జాబితా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. వీరు ప్రధానంగా ఐడీ, చిరునామా, జీతం స్లిప్​, ఐటీఆర్​, బ్యాంకు స్టేట్​మెంట్​లు అందజేయాల్సి ఉంటుంది.
  • Home loan for self employed : స్వయం ఉపాధి పొందేవారు అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. వ్యాపార యాజమాన్య హక్కులు తెలిపే పత్రాలు, జీఎస్​టీ స్టేట్​మెంట్స్​, ఐటీ రిటర్నులు, రాబడి వివరాలు మొదలైనవి అన్నీ సమర్పించాల్సి ఉంటుంది.

ఎఫ్​ఓఐఆర్​
FOIR for home loan : బ్యాంకులు 'ఫిక్స్​డ్​ ఆబ్లిగేషన్​ టు ఇన్​కమ్​ రేషియో' (ఎఫ్​ఓఐఆర్)ను ఆధారం చేసుకొని మీ హోమ్​ లోన్​ దరఖాస్తును మూల్యాంకనం చేస్తాయి. ఇది మీ నెలవారీ నికర ఆదాయం, రుణ చెల్లింపుల నిష్పత్తిని తెలుపుతుంది.

ఉదాహరణకు మీరు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు అనుకుందాం. కానీ మీ ఆదాయంలో రూ.50 వేలు ఈఎంఐలకు కడుతున్నారు అనుకుంటే.. అప్పుడు మీ ఎఫ్​ఓఐఆర్​ 50 అవుతుంది. హోమ్​లోన్​ తీసుకోవాలనుకునే వారు ఈ ఎఫ్​ఓఐఆర్​ అనేది 50కి దాటకుండా చూసుకోవాలి. అలాగే చిన్న చిన్న రుణాలు ఉంటే, వాటిని పూర్తిగా తీర్చివేసి, ఆ రుణ ఖాతాను మూసివేయడం మంచిది.

ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్​ను ఎంచుకోండి
బ్యాంకులు విశ్వసనీయ ప్రాపర్టీ డెవలపర్​ల వైపే మొగ్గు చూపుతాయి. ఎందుకంటే వీరు సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తారు కనుక. అందుకే చాలా బ్యాంకులు ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్​లతో టై-అప్​ కలిగి ఉంటాయి. అందువల్ల బ్యాంకులు ఆమోదించిన డెవలపర్​ను ఎంచుకోవడం వల్ల మీ హోమ్​ లోన్​ త్వరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రీ-అప్రూవ్డ్ హోమ్​ లోన్​
Pre approved home loan : మీ రీపేమెంట్ సామర్థ్యం, ఆదాయం, క్రెడిట్​ స్కోర్​ ఆధారంగా బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్​ హోమ్​ లోన్​లను అందిస్తాయి. మీ ఆర్థిక రికార్డుల ఆధారంగా .. సంబంధిత పత్రాలన్నీ పరిశీలించి 1-2 రోజుల్లోపు రుణం మంజూరు చేస్తాయి. మీ హోమ్​ లోన్​ దరఖాస్తు త్వరగా మంజూరు చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఇది కూడా ఒకటి.

డౌన్​ పేమెంట్​ పెంచండి
Home loan down payment : బ్యాంకులు ఆస్తి ధరలో 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే రుణాలు ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్నే సాధారణ పరిభాషలో డౌన్​ పేమెంట్ అంటారు. వాస్తవానికి అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ డౌన్​ పేమెంట్​ను చెల్లించి బ్యాంకుల నమ్మకాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది కూడా హోమ్​ లోన్​ త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది.

సంబంధాలు కొనసాగించండి
మీ శాలరీ అకౌంట్​ ఉన్న బ్యాంకు నుంచి హోమ్​లోన్​ పొందడం సులువు. ఎందుకంటే మీ ఆర్థిక చరిత్ర మీ బ్యాంకుకు పూర్తిగా తెలిసి ఉంటుంది. దీని వల్ల వేగంగా రుణం పొందే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.