How to Get Monthly Rs 5000 Pension from NPS in Telugu : ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చేరిన ఉద్యోగస్తులు తమ భవిష్యత్తును ఆర్థికంగా కాపాడుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. తమ వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఉద్యోగంలో చేరిన మొదట్లోనే ఏదో ఒక పొదుపు పథకం(Savings Scheme)లో పెట్టుబడి ప్రారంభిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. అదేవిధంగా పదవీ విరమణ గురించి ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టాలని వారు సూచిస్తుంటారు. అయితే మీరు కూడా అలాగే మంచి పెట్టుబడి మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? ఉద్యోగ విరమణ తర్వాత మీ చేతికి నెలకు రూ.50వేలు అందుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) బెస్ట్ దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అందిస్తోంది. ఇంతకీ ఆ స్కీమ్ ఏమిటి? దాంట్లో నెలనెల ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీరు పదవీ విరమణ తర్వాత రూ.50 వేలు పొందుతారో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
National Pension System Details in Telugu : అదే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్). దీనినే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా పేర్కొంటారు. ఈ పథకంతో ఎలాంటి రిస్క్ ఉండదు. సేవింగ్స్ పథకాల్లో పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందకు వస్తాయి. ఇందులోనూ గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయంపు ఉంటుంది. అలాగే సెక్షన్ 80సీలో రూ. 1.5 లక్షల లిమిట్ దాటిన వాళ్లు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పొదుపు చేసి అదనంగా రూ. 50 వేల పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం ఈ మినహాయింపు లబ్ధిదారులకు లభిస్తుంది.
National Pension Scheme Benefits : కేంద్రం అందిస్తున్న సామాజిక భద్రతా పెట్టుబడి పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్‌పీఎస్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే డబ్బులు కొంత ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లోకి వెళతాయి. అయితే ఈక్విటీల్లోకి, డెట్ ఫండ్స్‌లోకి ఎంత మొత్తం వెళ్లాలి అనేది ఖాతాదారుల ఇష్టం. వారి రిస్క్ ప్రోఫైల్ ఆధారంగా 75:25, 50:50, 40:60 ప్రకారం ఖాతాదారులకు నచ్చిన ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఖాతాదారులు ఎంచుకున్న దానిబట్టి ఎన్‌పీఎస్‌లో రిటర్న్స్ ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్లను నిర్మించడానికి అత్యంత ఇష్టపడే పెట్టుబడి పథకాలలో ఇది ఒకటిగా చాలా మంది భావిస్తుంటారు.
NPSలో చేరితే దిల్ఖుష్ రిటైర్మెంట్.. ట్యాక్స్ బెనిఫిట్స్.. సూపర్ రిటర్న్స్!
ఎన్‌పీఎస్‌లో మీరు నెలనెల రూ. 50 వేలు ఎలా పొందవచ్చంటే..
How to Generate Rs 5000 per Month from NPS : అయితే ప్రతి నెలా 50 వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్‌పీఎస్ కాలిక్యులేటర్ ప్రకారం.. ఉదాహరణకు మీరు 24 ఏళ్లు వయస్సున్నప్పుడు ఉద్యోగంలో చేరి సంపాదిస్తునట్లయితే ఈ నేషనల్ పెన్షన్ సిస్ట్‌మ్‌లో అకౌంట్ తెరిచి పొదుపు చేయడం ప్రారంభించారనుకుందాం. నెలకు రూ. 6వేల చొప్పున అంటే రోజూ 200 రూపాయల చొప్పున ఎన్‌పీఎస్‌లో పొదుపు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మీరు 60 సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడి పెట్టారు. అంటే మొత్తం 36 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేశారు. ఇలా 60 ఏళ్లు వచ్చేసరికి మీరు ఈ పథకంలో రూ. 25,92,000 పెట్టుబడిగా పోగుచేస్తారు. ఇప్పుడు మనం అందులో 10శాతం రాబడిని ఊహించినట్లయితే.. మొత్తం కార్పస్ విలువ(స్థిరమైన ఆదాయం లభించే పెట్టుబడి) రూ. 2,54,50,906 ఉంటుంది. అప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) 40 శాతం మెచ్యూరింగ్ ఆదాయం నుంచి యాన్యుటీని కొనుగోలు చేస్తే.. మొత్తం రూ. 1,01,80,362 అవుతుంది. ఇప్పుడు పెట్టుబడిపై 10శాతం రాబడిని ఊహిస్తే, మనకు ఏకమొత్తంలో రూ. 1,52,70,544 ఆదాయం వస్తుంది. ఈ విధంగా మనం ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు రూ. 50,902 పెన్షన్‌గా పొందవచ్చు.
కనిష్టంగా 40% యాన్యుటైజేషన్ నియమం :
Minimum 40% Annuitization Rule : ప్రస్తుత నిబంధనల ప్రకారం.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఎన్‌పీఎస్ కార్పస్‌ను ఉపసంహరించుకోలేరు. మీరు యాన్యుటీని కొనుగోలు చేయడానికి కనీసం 40% కార్పస్‌ని ఉపయోగించాలి. ఇది పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఆదాయాన్ని అందిస్తుంది. మిగిలిన 60% పన్ను-రహితంగా ఉపసంహరించుకోవచ్చు. కానీ, ఎవరైనా కోరుకుంటే యాన్యుటీని కొనుగోలు చేయడానికి కార్పస్‌లో 40% కంటే ఎక్కువ (మరియు పూర్తి 100% వరకు) కూడా ఉపయోగించవచ్చు.