How to Check Paytm Payments Bank IFSC Code in Telugu : ప్రస్తుతం ఎక్కడ చూసిన యూపీఐ ఆధారిత పేమెంట్లు అధికంగా జరుగుతున్నాయి. తమ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు చేసేస్తున్నారు వినియోగదారులు. ఇప్పటివరకూ ఈ తరహా లావాదేవీలు చేయాలంటే కేవలం పలు యాప్‌ల ద్వారా మాత్రమే సాధ్యమైంది. కానీ పేటీఎం(Paytm) వంటి వాటితో మీ బ్యాంకు అకౌంట్‌ను అనుసంధానించి, ఖాతాలోని మనీని వాడుకోవచ్చు. అయితే ఈ లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు అన్ని బ్యాంకుల మాదిరిగానే పేటీఎం కూడా IFSC కోడ్(Paytm IFSC Code) అందిస్తోంది. చాలామందికి పేటీఎం IFSC కోడ్ గురించి తెలువదు. ఈ కోడ్ మీ లావాదేవీల విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇంతకీ పేటీఎం ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎలా తెలుసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Paytm Payments Bank IFSC Code Check : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశంలోని ప్రతి బ్యాంకుకు ఉన్న అన్నీ శాఖలకు 11 అంకెల IFSC అనే ప్రత్యేక ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తోంది. IFSC పూర్తి రూపం ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇది ఎలక్ట్రానిక్ మోడ్ చెల్లింపులకు చాలా అవసరం. కేవలం ఒక్క IFSC నంబర్‌తో మీ బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, రాష్ట్రం, జిల్లా, నగరం/పట్టణం వంటి మీ బ్యాంకుకు సంబంధించిన అన్ని వివరాలను పొందవచ్చు. ఇప్పుడు మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తెలుసుకోవడం ద్వారా దానికి చెందిన అన్ని విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు.
How To Find Paytm IFSC Code in Telugu :
Paytm IFSC కోడ్‌ను తెలుసుకోవడం ఎలాగంటే..
- మొదట మీరు పేటీఎం అధికారిక వెబ్‌సైట్ https://paytm.comని ఓపెన్ చేయాలి.
- అప్పుడు Paytm వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.. దానిని కిందికి స్క్రోల్ చేసి 'Financial Tools & Calculator' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు "IFSC Finder"ఆప్షన్ కనిపించే వరకు వెబ్‌పేజీని క్రిందికి స్క్రోల్ చేయాలి.
- అప్పుడు ముందుగా మీరు బ్యాంకు, రాష్ట్రం, నగరం, మీ బ్రాంచ్ శాఖను ఎంచుకోవాలి.
- అక్కడ అడిగిన అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మీ బ్యాంక్ బ్రాంచ్ IFSC కోడ్‌తో పాటు ఇతర వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
How To Login into Paytm Payments Bank For IFSC Code in Telugu :
IFSC కోడ్ కోసం Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి ఎలా లాగిన్ అవ్వాలంటే..
- మొదట మీరు https://www.paytmbank.comతో Paytm పేమెంట్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన వెబ్‌సైట్ హోమ్ పేజీలో "Netbanking Login"ఎంపికపై క్లిక్ చేయాలి.
- అక్కడ అది Paytm పేమెంట్స్ బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ లాగిన్ విభాగాన్ని ప్రదర్శిస్తుంది.
- ఆ తర్వాత మీ "రిజిస్టర్డ్ మొబైల్ నంబర్"ని నమోదు చేసి.. “Send OTP”పై క్లిక్ చేయాలి. అప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి
- అప్పుడు బ్యాంక్ మిమ్మల్ని మీ Paytm పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు తీసుకెళ్తుంది. అలాగే బ్యాంక్ అందించే ఆర్థిక సేవలకు మీకు యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది.
QR కోడ్ ఉపయోగించి Paytm లాగిన్ చేయండిలా..
- మీరు మొదట మీ మొబైల్ ఫోన్‌లో Paytm మొబైల్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత మొబైల్ అప్లికేషన్ హోమ్ పేజీ దిగువన అందుబాటులో ఉన్న స్కాన్ ఎంపికను ఎంచుకోవాలి.
- ఆపై వెబ్‌సైట్‌లోని లాగిన్ విభాగంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా మీ Paytm పేమెంట్స్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేస్తుంది.
- అప్పుడు మీరు వెబ్‌సైట్‌లో అందించిన సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతించబడతారు.
Paytm పేమెంట్స్ బ్యాంక్ అందించే సేవలు :
సేవింగ్స్ ఖాతా : ఎవరైనా Paytm పేమెంట్స్ బ్యాంక్‌తో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇతర బ్యాంకులతో నిర్వహించగల అన్ని కార్యకలాపాలను దీని ద్వారా నిర్వహించుకోవచ్చు.
Paytm వాలెట్ : Paytm E-Wallet సేవను అందిస్తుంది. దీనిని స్కాన్ చేయడం ద్వారా నిర్దిష్ట పరిమితి వరకు ఎంత డబ్బు అయినా బదిలీ చేయవచ్చు. బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. మీరు Paytm వాలెట్‌లో డబ్బును స్వీకరించవచ్చు. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, డబ్బు బదిలీలు మొదలైనవి కూడా చేయవచ్చు.
డెబిట్ కార్డ్‌లు : అన్ని ఇతర బ్యాంకుల మాదిరిగానే Paytm పేమెంట్స్ బ్యాంక్ కూడా డబ్బు డిపాజిట్ చేయడం, షాపింగ్ చేయడం, బిల్లు చెల్లింపులు, ATMల నుంచి నగదు ఉపసంహరణ మొదలైన వివిధ సేవల కోసం ఉపయోగించే ATM కార్డ్‌లను అందిస్తుంది.
Paytm కా ATM : ఇది Paytm పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారులకు అందించే ప్రత్యేక ఫీచర్. ఈ సేవలో, Paytm బ్యాంక్ అధీకృత ఏజెంట్లుగా పిలవబడే కొంతమంది దుకాణదారులను నియమిస్తుంది. ఈ ఏజెంట్లు Paytm సేవలను ఉపయోగించడంలో మీకు సహాయపడగలరు.
ఫాస్ట్‌ట్యాగ్ : ఇది టోల్ గేట్ల వద్ద చెల్లింపులు చేయడానికి అన్ని నాలుగు చక్రాల వాహనాలకు అందించబడిన ట్యాగ్. Paytm ఫాస్ట్‌ట్యాగ్‌ల ప్రొవైడర్‌లలో ఒకటి. Paytm మొబైల్ అప్లికేషన్‌ని ఉపయోగించి ఫాస్టాగ్ హోల్డర్‌లు తమ ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
సూపర్ ఫీచర్‌తో పేటీఎం.. ఇకపై పిన్ లేకుండానే పేమెంట్స్
UPI Money Sent To Wrong Recipient? What next? : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. ఏం చేయాలి?