ETV Bharat / business

How To Download Voter ID Card Online : ఓటర్ ఐడీ కావాలా?.. ఆన్​లైన్​లో ఇన్​స్టాంట్​గా డౌన్​లోడ్ చేసుకోండిలా! - How to download digital voter card

How To Download Voter ID Card Online : కొత్తగా ఓటర్​ ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎన్నికల సంఘం నుంచి ఫిజికల్​ కార్డు రావడం ఆలస్యం అవుతోందా? అయితే మరేం ఫర్వాలేదు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కల్పించిన వెసులుబాటుతో ఇంట్లో కూర్చొనే మీ ఓటర్​ ఐడీ కార్డును క్షణాల్లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

How To Download Voter Id Card Online In Telugu
E Epic Download
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 9:47 AM IST

How To Download Voter ID Card Online : ఓటర్​ ఐడీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొని ఫిజికల్​ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ-ఓటరు గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్‌)ను మొబైల్​ లేదా ల్యాప్​టాప్​ లేదా కంప్యూటర్​ సాయంతో సులువుగా ఆన్​లైన్​లోనే డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌లో పలు కీలక మార్పులు చేసింది. తాజాగా తెచ్చిన ఈ విధానంలో మొబైల్‌ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఓటు హక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆన్​లైన్​లో ఈ-ఓటరు ఐడీని పొందండిలా..
How To Download Voter Id Card Online Sitting At Home :

  • ముందుగా NVSP పోర్టల్​ https://voters.eci.gov.in/లోకి లాగిన్​ అవ్వాలి.
  • తర్వాత హోమ్​ పేజ్​లో ఉన్న 'E-Epic Download' ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • అనంతరం స్క్రీన్​పై అడిగే విధంగా మీ మొబైల్​ నంబర్​ లేదా ఈ-మెయిల్​ ఐడీ లేదా EPIC నంబర్​ను ఎంటర్​ చేసి సబ్​మిట్​ బటన్​ నొక్కండి.
  • తరువాత 'Request OTP'పై క్లిక్​ చేస్తే మీ ఫోన్​కు ఓ ఓటీపీ వస్తుంది.
  • ఈ OTPని నిర్దేశించిన బాక్స్​లో నమోదు చేయాలి.
  • చివరగా డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డును డౌన్​లోడ్​ చేసుకునేందుకు 'Download e-EPIC' అనే ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • దీంతో మీరు ఇంట్లో కూర్చొనే సులువుగా ఓటర్​ ఐడీని పీడీఎఫ్​ ఫార్మాట్​లో పొందవచ్చు.
  • ఒకవేళ ఫిజకల్​ కార్డు కావాలనుకునే వారు దగ్గర్లోని మీ-సేవా లేదా ఇంటర్నెట్​ కేంద్రానికి వెళ్లి ఓటర్​ ఐడీ కార్డును భౌతికంగా పొందవచ్చు.

తప్పిన తిప్పలు..
పీడీఎఫ్​ ఫార్మాట్​లో ఉండే ఈ-డిజిటల్​ ఓటర్​ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగానే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రక్రియతో ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఈ సౌలభ్యం గతంలోనూ ఉన్నప్పటికీ.. అది ఆమోదం పొందేందుకు చాలా సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరువాతే ఆ ప్రక్రియ పూర్తయ్యేది.

New Voter ID Application : కొత్త ఓటర్​ ఐడీ కార్డు పొందడం ఇంత తేలికా.. అయితే ఇప్పుడే అప్లై చేసేద్దాం..

How to Apply For Duplicate Voter ID Card in Online : ఓటర్ కార్డు పోయిందా..? డోన్ట్​వర్రీ.. ఇలా పొందండి!

How to Check Voter ID Status in Telangana: మీరు కొత్త ఓటర్​ కార్డ్​కు అప్లై చేసుకున్నారా..? స్టేటస్​ ఇలా చెక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.