How To Change Train Journey Date : రైలు టికెట్ బుక్ చేసుకున్న తరువాత.. కొన్ని సార్లు మన ప్రయాణాలు వాయిదా పడవచ్చు. లేదా ప్రయాణం మరో తేదీకి మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది టికెట్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మీరు ప్రయాణ తేదీని కాస్త ముందుకు లేదా వెనక్కు మార్చుకోవచ్చు. భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే నిబంధనల ప్రకారం ఎలా మార్చుకోవాలి..?
How To Change Train Journey Date :
- ఒకసారి బుక్ చేసుకున్న టికెట్ తేదీని ముందుకు లేదా వెనక్కి మార్చుకోవచ్చు.
- రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
- రిజర్వేషన్ డెస్క్ దగ్గరకు వెళ్లి సంబంధిత దరఖాస్తును సిబ్బందికి సమర్పించాలి.
- అలాగే మీరు అనుకున్న తేదీలో సీట్లు అందుబాటులో ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.
- మీ అనుకున్న తేదీలో సీట్లు అందుబాటులో ఉంటే.. టికెట్‌ను అప్పటికి మార్చుకోవచ్చు.
పై క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు!
How To Upgrade Train Ticket Class : రిజర్వ్ చేసుకున్న టికెట్‌ను అప్పర్ క్లాస్‌కు మార్చుకునేందుకు కూడా రైల్వే శాఖ ప్రయాణికులకు వీలు కల్పిస్తోంది. అంటే మీరు లోవర్ క్లాస్ నుంచి పై క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. టీటీఈతో మీరు నేరుగా మాట్లాడి పై క్లాస్‌లో ప్రయాణం చేయవచ్చు. అయితే దీనికి అయ్యే అదనపు ఛార్జీలను మీరు టీటీఈకి చెల్లించాల్సి ఉంటుంది.
పై క్లాస్‌కు అప్‌గ్రేడ్ కావడం ఎలా?
How To Upgrade Class In Train :
- ఒకవేళ మీరనుకున్న క్లాస్‌లో టికెట్‌లు లేకపోతే.. అప్‌గ్రేడ్ అయ్యేందుకు కూడా వెసులుబాటు ఉంది.
- దీనికి సంబంధించిన దరఖాస్తును రిజర్వేషన్ డెస్క్‌లో సమర్పించాలి. దీంతో మీ టికెట్ తేదీ, క్లాస్‌లలో మార్పులు చేస్తారు.
- అయితే, క్లాస్ అప్‌గ్రేడ్‌కు కచ్చితంగా అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ ముందు బుక్ చేసుకున్న క్లాస్‌లోనే ప్రయాణించే అవకాశం లభిస్తే ఎలాంటి అదనపు రుసుము కట్టాల్సిన అవసరం లేదు.
గమనిక : ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రం.. పై క్లాస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే సౌలభ్యం అందుబాటులో లేదు.
ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు!
How To Extend Train Travel Distance : మనం టికెట్‌ను ఎక్కడి వరకైతే బుక్ చేసుకుంటామో దాని కంటే ఎక్కువ దూరం కూడా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తోంది భారతీయ రైల్వే. అయితే ఈ సదుపాయాన్ని టీటీఈతో మాట్లాడి పొందొచ్చు. మీరు టికెట్ తీసుకున్న స్టేషన్ రావడానికి ముందే.. టీటీఈతో మాట్లాడి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అయితే ఇలా ఎక్కువ దూరము ప్రయాణించాలనుకుంటే టీటీఈకి కొంత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.