How to block Union Bank ATM card : ఒక్కోసారి అజాగ్రత్త వల్లనో.. లేదా ఎవరైనా దొంగిలించడం వల్లనో.. ఏటీఎమ్ కార్డులు పోతాయి. అలాంటప్పుడు వెంటనే ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేయాలి. లేదంటే అకౌంట్లోని డబ్బులన్నీ దొంగలు మాయం చేసే అవకాశం ఉంటుంది. అయితే.. కార్డును బ్లాక్ చేసే విధానం బ్యాంకును బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) కస్టమర్ అయితే.. ఏటీఎమ్ కార్డును ఎలా బ్లాక్ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో..
- యూనియన్ బ్యాంక్ ATM బ్లాక్ నెంబర్ 8002082244, కస్టమర్ కేర్ నెంబర్ 1800222244
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి UBI ATM బ్లాక్ నంబర్‌కు డయల్ చేయండి.
- కాల్‌లో IVR మెనూని అనుసరించి.. ATM కార్డ్ బ్లాక్ ఆప్షన్‌ను ఎంపికను ఎంచుకోండి.
- డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసి కాల్ ద్వారా కార్డు బ్లాక్ చేయాలి.
- మీకు ఏదైనా సహాయం కావాలంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ని సంప్రదించండి.
- కస్టమర్ కేర్‌కు ఫ్రీగా కాల్ చేయొచ్చు. 24x7 పని చేస్తుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా..
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- మెనూ డాష్‌బోర్డ్ నుంచి ATM కార్డ్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి.
- తర్వాత ATM కార్డ్ బ్లాక్ అప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ ATM కార్డులోని మొదటి నాలుగు, చివరి నాలుగు నెంబర్లు కనిపిస్తాయి.
- మీ పోయిన కార్డు వివరాలను సరిగ్గా చూసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. అలాగే ఏటీఎమ్ కార్డ్ పిన్‌ను ఎంటర్ చేయాలి.
- రెండు ప్రక్రియలు సక్సెస్ అయిన తరవాత, ఏటీఎమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది.
మొబైల్ యాప్ (U Mobile APP)తో ఎలా బ్లాక్ చేయాలి?
- మొబైల్ ఫోన్‌లో U-Mobile బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, MPIN ( Mobile Banking Personal Identification Number)తో లేదా బయోమెట్రిక్స్ ద్వారా లాగిన్ అవ్వండి.
- మెనూ నుంచి డెబిట్ కార్డ్ కంట్రోల్ అప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత డెబిట్ కార్డ్ హాట్‌లిస్టింగ్‌ని క్లిక్ చేయండి.
- మీ MPINని నమోదు చేసి, డెబిట్ కార్డ్ బ్లాక్‌ను క్లిక్ చేయండి.
ఒకవేళ మీకు ఇలా బ్లాక్ చేయడం సాధ్యం కాకపోతే.. మీకు దగ్గరలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. బ్యాంకు అధికారులకు మీ కార్డు పోయిన లేదా చోరీకి గురైన విషయాన్ని తెలియజేయాలి. వెంటనే మీ ఏటీఎం కార్డుని బ్లాక్ చేయాలని కోరండి. వారు తక్షణమే మీ పని పూర్తి చేస్తారు.
Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్ : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..?
Face Recognition for ATM and Bank Transactions : మీ డబ్బులు సేఫ్.. ఏటీఎంలో ఫేస్ రికగ్నిషన్..!