SBI Credit Card Apply Process in Telugu : నేటి ఆధునిక కాలంలో ఎక్కడికైనా షాపింగ్‌కు వెళ్లినా లేదా ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినా.. చాలా మంది క్రెడిట్ కార్డునే వినియోగిస్తున్నారు. తగినంత డబ్బు చేతిలో లేకపోవడం.. EMI సౌకర్యాలు ఉండడం వంటి కారణాలతో.. క్రెడిట్ కార్డులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా.. తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లతో క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. దేశంలో అత్యంత జనాధరణ పొందిన బ్యాంక్‌గా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ బెనిఫిట్స్‌తో వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది.
ఎస్బీఐ ఆఫర్స్..
SBI Credit Card Details : క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, రివార్డు పాయింట్లు, ఈఎంఐ ఆప్షన్, ఇన్స్టంట్ క్రెడిట్.. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ అందిస్తోంది ఎస్బీఐ. అయితే.. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి? అర్హత ప్రమాణాలు ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో క్లియర్‌గా తెలుసుకుందాం.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌తోపాటు.. మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు.. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడం ఎలా..?
How Apply SBI Credit Card Online :
1. మొదట ఆన్లైన్లో ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
2. అనంతరం అక్కడ ఎస్బీఐ కార్డు అధికారిక వెబ్సైట్ https://www.sbicard.com/ ని ఓపెన్ చేయాలి.
3. అప్పుడు వచ్చిన హోమ్ పేజీలో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న కార్డుని ఎంచుకోవాలి.
4. ఆ తర్వాత మీకు మీకు కావాల్సిన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు అడుగుతుంది. వాటిని నింపాలి.
5. అదేవిధంగా కొన్ని అర్హత పత్రాలను అడుగుతుంది. వాటిని సమర్పించాలి.
6. అడిగినవన్నీ నమోదు చేశాక సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఎస్బీఐ మీ దరఖాస్తును సమీక్షిస్తుంది. చివరగా అన్ని వివరాలు సరైనవా లేదా అని చూసి ఆమోదిస్తుంది.
7. అప్పుడు మీ క్రెడిట్ కార్డు మీరు దరఖాస్తు సమయంలో ఇచ్చిన చిరునామాకు వస్తుంది.
Reasons For Credit Card Limit Decrease : మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిందా?.. కారణాలు ఇవే!
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :
గుర్తింపు కార్డు(పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. లాంటివి)
నివాస ధ్రువపత్రం (దరఖాస్తుదారుని రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపత్రాలు లాంటి వాటిల్లో ఏదో ఒకటి)
ఆదాయ ధ్రువీపకరణ పత్రం (ఆదాయపు పన్ను రిటర్న్స్ , దరఖాస్తుదారుని గత మూడు నెలల జీతం స్లిప్‌లు, ఉద్యోగ నియామక పత్రం) వంటి అవసరమైన పత్రాలను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.
మీరు సమర్పించిన వాటిని పరిశీలించిన తర్వాత.. అంతా ఓకే అనుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు జారీచేస్తుంది.
అయితే క్రెడిట్ కార్డు వాడకం కత్తిమీద సాములాంటిదే. బెనిఫిట్స్ తెలుసుకొని వాడితే ఉపయోగం. అలాకాకుండా ఇష్టానుసారంగా వాడితే.. ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.
SBI క్రెడిట్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు
(SBI Credit Card Benefits) :
1. రివార్డ్ పాయింట్లు : మీరు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుని ఉపయోగించి చేసే ప్రతి కొనుగోలుకు కొన్ని రివార్డు పాయింట్లు పొందవచ్చు. క్యాష్‌బ్యాక్, సరుకులు, ప్రయాణ వోచర్‌లు ఇలా అనేక రకాల రివార్డ్‌ల కోసం ఈ పాయింట్‌లను రీడీమ్ చేయవచ్చు.
2. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు : కొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులు నిర్దిష్ట వ్యాపారుల వద్ద లేదా నిర్దిష్ట వర్గాల్లో చేసిన కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తాయి. రోజువారీ ఖర్చులపై డబ్బు ఆదా చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.
3. కొనుగోళ్లపై తగ్గింపులు : తరచుగా ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద చేసిన కొనుగోళ్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డులు తగ్గింపులను అందిస్తాయి. ఈ తగ్గింపులు కొన్ని శాతం పాయింట్ల నుంచి ముఖ్యమైన పొదుపుల వరకు ఉంటాయి.
4. వెసులుబాటుగా ఈఎంఐలు : మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుని ఉపయోగించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే, మీరు దానిని సులభంగా ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. ఇది మీ ఆర్థిక నిర్వహణను సులభతరం చేస్తుంది. అలాగే అధిక వడ్డీ ఛార్జీల నుంచి కాపాడుతుంది.
5. క్రెడిట్ స్కోర్ : బాధ్యతాయుతంగా మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుని ఉపయోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు. అలాగే లోన్‌లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులకు ఆమోదం పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.
How to Use SBI Credit Card in Telugu : అలాగే మీ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా లోన్, లావాదేవీలు, ఈఎంఐ(EMI)లు తీసుకుంటే మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. లేదంటే.. గడువు దాటినందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీ క్రెడిట్ స్కోరుకు నష్టం కలుగుతుంది. ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకొని క్రెడిట్ కార్డు వాడితే.. వినియోగదారులకు మేలే జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
Credit Score : కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. అయితే మీ క్రెడిట్ స్కోరును పెంచుకోండిలా!