How to Activate the Inactive Account of Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో "సుకన్య సమృద్ధి యోజన" అత్యంత ఆదరణ పొందిన పథకం. అమ్మాయిల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఓ వరం. ప్రతినెలా ఈ పథకంలో పొదుపు చేస్తే.. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయి. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కన్నా.. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ ఎక్కువే. ఇంకా.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను రాయితీ సైతం పొందవచ్చు. ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సాధారణంగా ఇది 21 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కలిగి ఉంటుంది. ఏడాదికి రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవచ్చు.
ఇదిలా ఉంటే.. చాలా మంది సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి.. కొన్ని నెలలు రెగ్యులర్‌గా పేమెంట్స్ చేసి.. ఆ తర్వాత వివిధ కారణాలతో పేమెంట్స్ చేయడంలో విఫలమవుతారు. ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ చేయడంలో విఫలమైతే.. ఆ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. అంటే.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఇలా అంకౌట్ ఫ్రీజ్ అయితే ఏం జరుగుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అకౌంట్ ఫ్రీజ్ అయితే జరిగేది ఇదే..
- సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే.. ఖాతా ఫ్రీజ్ అయిన మూడేళ్లలోపు మాత్రమే సాధ్యం.
- మూడేళ్ల నిర్దేశిత పీరియడ్ దాటినట్లయితే.. ఆ తర్వాత యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండదు.
- ఖాతా ఆరు నెలల కంటే తక్కువ కాలం ఇన్‌యాక్టివ్‌లో ఉంటే.. ఖాతాలో రూ.500 డిపాజిట్ చేయాలి.
- ఖాతా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఇన్‌యాక్టివ్‌లో ఉంటే.. ఖాతాలో రూ.1000 డిపాజిట్ చేయాలి.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? :
- మీ అకౌంట్ ఉన్న పోస్టాఫీసు లేదా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలి.
- ఖాతాను యాక్టివేట్ చేయడానికి అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేయాలి.
- అంటే.. పేరు, అకౌంట్ నంబర్, ఎందుకు ఖాతా ఫ్రీజ్ అయ్యింది అనే కారణాలు తెలపాలి.
- ఫారమ్‌తో పాటు కావాల్సిన డాక్యుమెంట్లను జత చేయాలి.
- పెనాల్టీలు, బకాయిలు చెల్లించాలి.
- అధికారులు వాటిని పరిశీలించి మీ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తారు.
- ఆ తర్వాత మీరు మళ్లీ రెగ్యులర్‌గా డిపాజిట్ చేసుకుని బెనిఫిట్స్ పొందవచ్చు.
అలర్ట్ - చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మారిన రూల్స్ - మీరు తెలుసుకోవాల్సిందే!
సుకన్య సమృద్ధి ఖాతాను యాక్టివేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు:
- ఖాతాదారు ఆధార్ కార్డ్
- బాలిక జనన ధ్రువీకరణ పత్రం
- బాలిక అడ్రస్ ప్రూఫ్ (రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు మొదలైనవి)
MMSC Vs SSY : సుకన్య సమృద్ధి యోజన Vs మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్.. ఏది బెస్ట్ ఆప్షన్?