ETV Bharat / business

వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి! - గృహరుణం

రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్‌లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణం మరింత భారం కానుంది. ఇలాంటి సందర్భంలో వడ్డీ రేటుపై ఎంతో కొంత రాయితీ వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? తెలుసుకుందాం.

interest
వడ్డీ
author img

By

Published : Jul 15, 2022, 1:38 PM IST

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆ ప్రభావం వడ్డీ రేట్లపైనా పడుతోంది. దీర్ఘకాలం తీసుకునే రుణాలకు అధిక వడ్డీ చెల్లిస్తే.. మన జేబుపై భారం తప్పదు. 15-20 ఏళ్లు కొనసాగే రుణంపై 25-50 బేసిస్‌ పాయింట్ల వడ్డీ ఎక్కువగా ఉన్నా.. దాని ప్రభావం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంటి రుణాలు తీసుకునేటప్పుడు ఇది తప్పనిసరిగా గమనించాల్సిన అంశం.

రుణదాతను అడగండి..
ఇప్పుడు బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లను రెపో ఆధారంగానే నిర్ణయిస్తున్నాయి. రెపో రేటుకు, కొంత క్రెడిట్‌ స్ప్రెడ్‌ను కలిపి వడ్డీ రేటు పేర్కొంటాయి. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 4.90శాతం ఉంది. దీనికి ఒక బ్యాంకు 2.70% క్రెడిట్‌ స్ప్రెడ్‌ను నిర్ణయిస్తే.. వడ్డీ రేటు 7.60 శాతంగా మారుతుంది. ఈ స్ప్రెడ్‌ రేటు రుణ వ్యవధి కొనసాగినంత కాలం స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఇది 2.70 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 3.55 శాతం వరకూ వెళ్లొచ్చు. చాలా సందర్భాల్లో బ్యాంకులు తాము ప్రకటనల్లో చెప్పే రేటుకన్నా.. 15-20 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, రుణాలను అందించే అవకాశం లేకపోలేదు. ఇది పూర్తిగా రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు, చెల్లింపుల తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని కొత్త బ్యాంకుకు మార్చుకునే సందర్భంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలిక బంధం..
సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు వీలైనన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. మీ వేతనం ఖాతా, పెట్టుబడులు, ఇంతకు ముందే రుణాలు తీసుకోవడం తదితర లావాదేవీలు ఉన్నప్పుడు మీకు ఇతరులతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే రుణం రావచ్చు. కొన్నిసార్లు బ్యాంకుతో మీకున్న సంబంధాల ఆధారంగా రుణాలను ముందుగానే మంజూరు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో డిస్కౌంటు వడ్డీ రేటుకే రుణాలను అందించే అవకాశం ఉంది. వ్యక్తిగత, వాహన రుణాలను తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మందస్తు మంజూరు రుణాల (ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌) వల్ల ఆదాయ, ఇతర ధ్రువీకరణలు అందించాల్సిన అవసరాలు అంతగా ఉండవు. కొన్నిసార్లు.. ఒకటికి మించి అప్పులు ఒకే బ్యాంకులో తీసుకుంటే.. ఉదాహరణకు ఇంటి, కారు రుణం కోసం ఒకే బ్యాంకులో దరఖాస్తు చేస్తే కాస్త తక్కువ వడ్డీకి అప్పు పొందే వీలుంటుంది. ఒకసారి బ్యాంకుతో ఈ విషయాన్ని చర్చించండి.

వీటినీ గుర్తుంచుకోండి..

  • మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేదీ రుణ వడ్డీని నిర్ణయించడంలో బ్యాంకులు పరిశీలిస్తాయి. సాధారణంగా ప్రముఖ సంస్థలు, కార్పొరేట్లలో పనిచేస్తున్న వారికి ఈ విషయంలో ఇబ్బంది ఉండదు. సొంతంగా వ్యాపారం, వృత్తి నిర్వహించే వారికి వడ్డీ రేటు కాస్త అధికంగానే ఉంటుంది. కాస్త పరిశోధన చేశాకే బ్యాంకును ఎంచుకోండి.
  • మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు కొంత శాతం వడ్డీలో రాయితీని ఇస్తాయి. వీరు ప్రాథమిక రుణ గ్రహీత లేదా సహ-దరఖాస్తుదారులుగానూ ఉన్నా వడ్డీ తగ్గింపును అందిస్తాయి.
  • బ్యాంకులు గుర్తించిన డెవలపర్ల దగ్గర ఇల్లు, ఫ్లాటు కొన్నప్పుడు కొంతమేరకు వడ్డీ రాయితీ లభించే అవకాశాలున్నాయి. మీరు కొంటున్న ఆస్తికి ఏ బ్యాంకు రుణం ఇస్తుందో తెలుసుకోండి. వాహన రుణాలకూ ఇదే వర్తిస్తుంది.

800 దాటితే..
ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుతాయి. వాయిదాల చెల్లింపులను సక్రమంగా చేయని వారికి బ్యాంకులు అధిక వడ్డీకే అప్పులిస్తాయి. మీ క్రెడిట్‌ స్కోరు 750 దాటితే.. మీరు మంచి రుణగ్రహీతగా బ్యాంకులు భావిస్తాయి. ఇలాంటి వారిని వదులుకోవు. 800 దాటి స్కోరున్న వారికి తక్కువ వడ్డీకే రుణాలను ఇచ్చేందుకు ముందుకువస్తాయి. కొత్త రుణం తీసుకోబోయే ముందు మీ క్రెడిట్‌ స్కోరు ఎంతుందో చూసుకోండి. ఇది 750 లోపు ఉంటే.. కొత్త రుణం తీసుకునేందుకు తొందరవద్దు. ముందు స్కోరు పెంచుకునే దిశగా చర్యలు చేపట్టండి.

తక్కువ మొత్తం..
గృహరుణాన్ని ఎంత మొత్తం తీసుకుంటున్నారనేదీ మీ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు రూ.30 లక్షల లోపు రుణాలకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. రూ.75లక్షలు దాటినప్పుడు వడ్డీ అధికంగా ఉంటుంది. ఇంటి విలువలో ఎంత నిష్పత్తి రుణాన్ని తీసుకుంటున్నారు అనేదీ కీలకమే. ఈ నిష్పత్తి తక్కువగా ఉంటే వడ్డీలో రాయితీ లభిస్తుంది. చాలా సందర్భాల్లో రుణగ్రహీతలు అధిక మొత్తంలో రుణం తీసుకునేందుకే మొగ్గు చూపిస్తుంటారు. దీనివల్ల వారి దగ్గరున్న పొదుపు మొత్తం ఖర్చవకుండా ఉంటుందని అనుకుంటారు. కానీ, అధిక రుణం దీర్ఘకాలంలో భారాన్నే మోపుతుందని మర్చిపోవద్దు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ బ్యాంక్‌బజార్‌

ఇదీ చూడండి : క్రెడిట్​ కార్డ్​తో నష్టం కాదు లాభమే! ఈ సింపుల్​ ట్రిక్స్​ పాటిస్తే చాలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.