ETV Bharat / business

ఒక్క ప్రశ్నతో నిమిషంలో రూ.17వేలు ఇచ్చిన చాట్​జీపీటీ.. మీరూ ట్రై చేస్తారా? - చాట్​ జీపీటీలో ఎలా డబ్బులు సంపాదించుకోవాలి

ఇంటర్నెట్​లో సంచలనంగా మారింది ఏఐ చాట్​బాట్​ 'చాట్​జీపీటీ'. ఆశ్చర్యపరిచే తన పనితనంతో రోజూ వార్తల్లో నిలుస్తోంది. తన శక్తి సామర్థ్యాల గురించి ప్రపంచానికి చాటి చెబుతోంది. తాజాగా 'డబ్బులు కావాలి' అని అడిగిన యూజర్​కు ఉన్నఫలంగా రూ.17 వేలు బ్యాంక్​ ఖాతాలో వేసింది. అదెలాగంటే?

how chat gpt find money for a person
how chat gpt find money for a person
author img

By

Published : Apr 25, 2023, 1:35 PM IST

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాని ఆధారంగా ఓపెన్​ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్​జీపీటీ.. ఆశ్చర్యపరిచే తన పనితనంతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. అది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. యూజర్లు తమ అనుభవాలను కథలుకథలుగా పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తనకు డబ్బులు కావాలి అని అడగగా.. అతడు క్లెయిమ్ చేసుకోని 210 డాలర్లు (దాదాపు రూ.17,000) రికవరీ చేసిపెట్టింది. దీంతో షాక్​ అవడం ఆ వ్యక్తి వంతైంది. తనకు జరిగిన ఘటనను ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసుకున్నాడు అమెరికాకు చెందిన ఆ వ్యక్తి.

"నా పేరు జోషువా బ్రౌడర్. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నా పుట్టిన తేది 12/17/96. నాకు కొంత డబ్బులు కావాలి?" అని ఆ వ్యక్తి చాట్​జీపీటీతో అడిగాడు. అనంతరం రంగంలోకి దిగిన చాట్​జీపీటీ.. అతడి పేరు, వివరాలను నమోదు చేసి.. అతడు ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోని ఆఫర్​ను ఆన్​లైన్​లో వెతికిపెట్టింది. ఎలా క్లెయిమ్​ చేసుకోవాలో కూడా చెప్పింది. బ్రౌడర్​ కూడా చాట్​జీపీటీ చెప్పింది ఫాలో అయ్యాడు. నిమిషం వ్యవధిలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి 210 డాలర్లు తన బ్యాంక్​ ఖాతాలో జమ అయ్యాయని చెప్పుకొచ్చాడు. అయితే, చాట్​బాట్​కు క్యాప్చా రీడ్​ చేయడంలో ఇబ్బంది తలెత్తిందని.. అది మినహాయిస్తే మిగతాదంతా.. అదే చేసిందని తెలిపాడు.

బ్రౌడర్​ పోస్ట్​ చేసిన ట్వీట్​పై.. రకరకాలుగా స్పందించారు యూజర్లు. చాట్​జీపీటీతో తమకు జరిగిన సంఘటనలు కూడా షేర్​ చేసుకున్నారు. ఈ మేరకు ఓ నెటిజన్​ స్పందింస్తూ.. "(బ్రౌడర్​ ట్వీట్​ను ఉద్దేశిస్తూ) ఇది షేర్​ చేసినందుకు ధన్యవాదాలు! నేను కూడా దాన్ని చెక్​ చేశాను. ఏమీ ఆశించకుండా.. చెక్​ చేసి చూశాను. నా పేరు మీద ఇప్పటివరకు క్లెయిమ్​ చేయని 385 డాలర్లు ఉన్నాయి" అని తెలిపాడు. "మీరు ఇచ్చిన చిట్కాకు ధన్యవాదాలు. నా పేరు మీద ఇప్పటివరకు క్లెయిమ్​ చేయని ఐదు ఆస్తులు ఉన్నాయి" అని మరో యూజర్​ చెప్పుకొచ్చాడు. "ప్రతిరోజు ఏఐ.. దాని శక్తి సామర్థ్యాలతో నన్ను ఆశ్చర్యపరుస్తోంది" అని ఒకరు.. "వ్యక్తిగత సమాచారాన్ని ఏఐలో ఉంచడం బాధాకరం. మీలో కొందరు తెలివైన వ్యక్తులు కాదు'' అని మరో నెటిజన్ కామెంట్​ చేశాడు.

అయితే, ఏఐ సాంకేతికత.. ఇలాంటి పనులతో ఓవైపు ఆశ్చర్యపరుస్తూనే.. మరోవైపు, భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏఐలో కనిపిస్తున్న పురోగతి.. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్​మన్ శాక్స్​ అంచానా వేసింది. రానున్న రోజుల్లో ఈ కృత్రిమ మేధ దేనికి దారితీస్తుందో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.