Honda Elevate SUV Launch : జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ సెప్టెంబర్ 4న ఇండియన్ మార్కెట్లో హోండా ఎలివేట్ ఎస్యూవీ కారును లాంఛ్ చేసింది. ముఖ్యంగా ఈ హోండా ఎలివేట్ కారును నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి తెచ్చింది . ఈ ఎలివేట్ కారును.. గ్రాండ్ విటారాకు పోటీగా మార్కెట్లోకి తెచ్చినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
నేటి నుంచే డెలివరీ!
Honda Elevate Delivery Date : హోండా ఎలివేట్ కారును సోమవారం (సెప్టెంబర్ 4) నుంచే డెలివరీ చేయనున్నట్లు హోండా మోటార్స్ కంపెనీ స్పష్టం చేసింది.
హోండా ఎలివేట్ - వేరియంట్స్
Honda Elevate Variants : హోండా ఎలివేట్.. SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే వీటన్నింటిలోనూ 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది.
హోండా ఎలివేట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్
Honda Elevate Engine Specs :హోండా ఎలివేట్ కారులో 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. వాస్తవానికి దీనిని సిటీ సెడాన్ కారు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఇంజిన్ 119 bhp పవర్, 145 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అదే విధంగా ఇది 6 స్పీడ్ మాన్యువల్ అండ్ సీవీటీ యూనిట్ అనుసంధానం కలిగి ఉంటుంది. హోండా కంపెనీ ప్రకారం, ఎలివేట్ కారు ఒక లీటర్‌కు 16.92 కి.మీ ఫ్యూయెల్ ఎఫీసియన్సీతో పనిచేస్తుంది.
హోండా ఎలివేట్ ఫీచర్స్
Honda Elevate Features : హోండా ఎలివేట్ కారులో.. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి.
భద్రతాపరమైన ఫీచర్ల విషయానికి వస్తే.. ఎలివేట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సెన్సార్లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, ADAS సూట్ ఉంటుంది.
ఎలివేట్ కారు - ఎక్స్ షోరూమ్ ధరలు
Honda Elevate Price :
వేరియంట్ | ఎక్స్ షోరూమ్ ధరలు |
SV | రూ.11 లక్షలు |
V | రూ.12.11 లక్షలు |
V CVT | రూ.13.21 లక్షలు |
VX | రూ.13.50 లక్షలు |
VX CVT | రూ.14.60 లక్షలు |
ZX | రూ.14.90 లక్షలు |
ZX CVT | రూ.16 లక్షలు |
వరుసగా 5 కార్లు లాంఛ్ చేస్తాం!
Honda Upcoming Cars : జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ ఇండియాలో తన ఎస్యూవీ కార్ల మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు వ్యూహం రచించింది. అందులో భాగంగా 2030లోపు 5 ఎస్యూవీ కార్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్పోర్ట్స్ యుటిలిసీ కార్స్
Honda Sports Utility Cars : హోండా మోటార్ అనుబంధ సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా.. 2030లోపు 5 స్పోర్ట్స్ యుటిలిటీ కార్లను భారత్‌లో లాంఛ్ చేయనున్నట్లు.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు. దీని ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ సెగ్మెంట్లోనూ తమ కంపెనీ బలమైన పోటీదారుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.