ETV Bharat / business

సూపర్ సేఫ్టీ ఫీచర్స్​తో హోండా ఎలివేట్​ లాంఛ్.. ధర, బుకింగ్ వివరాలు ఇలా.. - honda elevate car cost

Honda Elevate Launch : అధునాతన టెక్నాలజీతో, మంచి సేఫ్టీ ఫీచర్లతో ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ హోండా సరికొత్త 'ఎలివేట్​ మోడల్'​ కార్లను తీసుకొచ్చింది. జులై నుంచి బుకింగ్​లు ప్రారంభమవుతాయని, అక్టోబర్​లో డెలివరీ ప్రారంభిస్తామని ప్రకటించింది.

Honda Elevate Launch
Honda Elevate Compact SUV Unveiled In India Ahead Of October Launch
author img

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 5:14 PM IST

Honda Elevate Launch details : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ హోండా మంగళవారం దిల్లీలో తన మిడ్​ రేంజ్​​ కారు 'ఎలివేట్​' మోడళ్లను ప్రదర్శించింది. 4.3 మీటర్లు పొడవుతో, 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సిలిండర్​ VTEC పెట్రోల్​ ఇంజిన్​లతో ఈ కారు ఉంటుందని పేర్కొంది. మంచి సేఫ్టీ ఫీచర్లతో, అధునాతన టెక్నాలజీతో దీనిని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

జులైలో బుకింగ్స్​.. అక్టోబర్​లో లాంఛ్​
హోండా ఎలివేట్​ అక్టోబర్​లో మార్కెట్​లోకి రానుంది. అయితే వచ్చే నెల జులై నుంచే అధికారిక బుకింగ్​లు ప్రారంభం కానున్నాయి.

భారీ పోటీ :
హ్యూందాయ్​ క్రెటా, కియా సెల్టోస్​, మారుతి సుజుకి గ్రాండ్​ విటారా, టొయోటా అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​, ఎమ్​జీ ఆస్టోర్, వోక్సోవ్యాగన్​ టైగన్​, స్కోడా కుషాక్​​ లాంటి ప్రముఖ బ్రాండ్​ కార్లతో పోటీపడే సెగ్మెంట్​లోకి ఈ హోండా ఎలివేట్​ వస్తోంది.

Honda Elevate specifications :
హోండా ఎలివేట్​ కస్టమర్ల అభిరుచి మేరకు అనేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే 5 సీట్లు కలిగి ఉండే హోండా ఎలివేట్​ కాస్త ఖరీదైనది.
హోండా ఎలివేట్​లో వైర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో సపోర్టు ఉన్న 10.25 అంగుళాల టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, ఏడు అంగుళాల హెచ్​డీ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​తో పాటు ప్రీమియం క్యాబిన్​ కూడా ఉంది.

ఆటోమేటిక్​ క్లైమేట్ కంట్రోల్​ సిస్టమ్​, హెడ్​రెస్ట్​లు, ఎయిర్​ కండీషనింగ్​ వెంట్స్​, ఆరు ఎయిర్ ​బ్యాగులు, ADAS ఆధారంగా పనిచేసే డ్రైవర్​ సపోర్ట్, సేఫ్టీ ఉంటాయి. సింగిల్​ పాన్​ సన్​రూఫ్​, కూల్డ్​ గ్లవ్​బాక్స్​, 360 డిగ్రీ కెమెరాను ఈ హోండా ఎలివేట్​లో పొందుపరిచారు.
హోండా ఎలివేట్​లో సరికొత్త CR-V, WR-V డిజైన్​లను అనుసరించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా 17 అంగుళాల అలాయ్​ చక్రాలు, మస్కులర్ సైడ్​ బాడీ క్లాడింగ్​, వీల్​ ఆర్చ్​లు, మంచి దృఢమైన రూఫ్​ పట్టాలు అన్నీ బాగున్నాయి.

honda elevate model car
హోండా ఎలివేట్​ మోడల్​

Honda Elevate Engine Specifications :

  • ఇంజిన్​ - 1.5ఎల్​ ఎన్​ఏ ఫోర్​ సిలెండర్​ పెట్రోల్​
  • పవర్​ - 121 పీఎస్​
  • టార్క్ -145 ఎన్​ఎమ్​
  • ట్రాన్స్​మిషన్​ - సిక్స్​ స్పీడ్​ ఎమ్​టీ/సీవీటీ

Safety Features in Honda Elevate :
లెవెల్​ 2 ఏడీఏఎస్​ టెక్​ బ్రేకింగ్ సిస్టమ్​, లేన్​ కీప్​ అసిస్ట్, ఆటో హై బీమ్​, రోడ్​ డిపార్చర్​ మిటిగేషన్​, అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​ మొదలైనవన్నీ ఈ ఎలివేట్​లో ఉన్నాయి. ఇవే కాకుండా లేన్​ వాచ్​ కెమెరా, రియర్​ సీట్​ రిమైండర్​, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్​, హిల్ స్టార్ట్​ అసిస్ట్, ఎమర్జెన్సీ సిగ్నల్​ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్​ వాచ్ కనెక్టివిటీ, హోండా కనెక్ట్​ యాప్​ ఫంక్షనాలిటీ కూడా ఇందులో ఉన్నాయి.

honda elevate specifications
హోండా ఎలివేట్​ స్పెసిఫికేషన్స్​

Honda Elevate Price ఎంతంటే?
మధ్య తరహా SUV విభాగంలో హోండా ఎలివేట్​ మంచి ప్రభావం చూపుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ధర రూ.10.50 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండొచ్చు అని అంచనా.

honda elevate car models exhibition
హోండా ఎలివేట్​ మోడల్స్​ ప్రదర్శన

ఇవీ చూడండి:

Last Updated : Jun 6, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.