ETV Bharat / business

మీరు హోమ్​ లోన్​ తీసుకున్నారా?.. ఈ ప్రొటెక్షన్​ ప్లాన్​ గురించి తెలుసుకోండి!

Home loan MRTA assurance : గృహ రుణం తీసుకున్నవారు.. MRTA బీమా పాలసీని తీసుకోవడం మంచిది. ఈ పాలసీ వల్ల అనుకోని క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు.. మీ కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఈ బీమా పాలసీనే మీ గృహరుణాన్ని తీర్చివేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Home loan MRTA assurance
home loan mortgage reducing term assurance
author img

By

Published : Jul 8, 2023, 2:40 PM IST

Home Loan Mortgage Reducing Term Assurance : మనలో చాలా మందికి సొంత ఇళ్లు కట్టుకోవడం ఒక కల. అందుకే అప్పు చేసి అయినా ఇళ్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఇందుకోసం బ్యాంకుల నుంచి గృహరుణం కూడా తీసుకుంటాం. అయితే దీనికి దీర్ఘకాలంపాటు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకే గృహరుణం తీసుకున్నవారు కచ్చితంగా తనఖా బీమా (మార్టిగేజ్​ రెడ్యూసింగ్​ టెర్మ్​ అస్యూరెన్స్) పాలసీని తీసుకోవడం మంచిది. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అనూహ్య పరిస్థితుల్లో..
MRTA Benefits : మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేము. కొన్ని సార్లు ఇవి వ్యక్తుల ఆర్థిక జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబానికి అర్ధాంతరంగా ఆదాయం ఆగిపోతుంది. రుణ వాయిదాలు చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఒకవైపు రుణ భారం, మరోవైపు కుటుంబ ఖర్చులు.. ఆర్థికంగా వారిని కృంగదీస్తాయి. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోతే.. బ్యాంకులు ఇంటిని స్వాధీనం చేసుకుంటాయి. ఇలాంటి అనుకోని సమస్యలను అధిగమించాలంటే.. గృహరుణం తీసుకునేటప్పుడే, తప్పనిసరిగా హోమ్​ లోన్​ ప్రొటెక్షన్​ ప్లాన్​ తీసుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు రుణ గ్రహీత మరణించిన సందర్భంలో బీమా కంపెనీ.. ఆ గృహ రుణం మొత్తాన్ని తీర్చేస్తుంది. అప్పుడు అతని కుటుంబం ఆర్థికంగా చాలా సురక్షితంగా ఉంటుంది.

తీసుకున్న రుణానికి తగినట్లుగా బీమా
Housing Loan Insurance : హోమ్​ లోన్ తీసుకున్నప్పుడు దానికి రక్షణగా మార్టిగేజ్​ రెడ్యూసింగ్ టెర్మ్​ అస్యూరెన్స్ (ఎంఆర్​టీఏ)​ పాలసీని తీసుకోవడం మంచిది. వాస్తవానికి ఇది సాధారణం టెర్మ్​ పాలసీలానే పనిచేస్తుంది. దురదృష్టవశాత్తు రుణ గ్రహీత మరణించినప్పుడు ఇంటి రుణాన్ని బీమా సంస్థ తీరుస్తుంది. ఫలితంగా కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సురక్షితంగా ఉంటుంది.

వాస్తవానికి పాలసీ విలువ నేరుగా గృహరుణం మొత్తానికి సర్దుబాటు అయ్యి ఉంటుంది. గృహరుణం కొనసాగినన్ని రోజులు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. వాయిదాలు సకాలంలో చెల్లిస్తూ ఉంటే, ఇంటి రుణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ మేరకు బీమా పాలసీ విలువ సర్దుబాటు అవుతూ ఉంటుంది. హోమ్​ లోన్​ ఇస్తున్నప్పుడే.. బ్యాంకులు లేదా గృహరుణ సంస్థలు ఈ పాలసీని తీసుకోమని సూచిస్తాయి. తమతో ఒప్పందం ఉన్న బీమా కంపెనీల నుంచి పాలసీని అందిస్తాయి.

తక్కువ ప్రీమియంతో.. పూర్తి రక్షణ
MRTA for joint housing loan : ఎంఆర్​టీఏ పాలసీల ప్రీమియం కాస్త తక్కువగానే ఉంటుంది. గృహ రుణాలు తీసుకున్న తరువాత వాయిదాలు చెల్లిస్తూ ఉంటాం. కనుక కాలక్రమేణా రుణ భారం తగ్గుతుంది. కనుక ఈ ఎంఆర్​టీఏ పాలసీ ప్రీమియం కాస్త తక్కువగానే ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించేందుకు వీలును కల్పిస్తాయి. లేదా గృహ రుణ వాయిదాలతో పాటు పాలసీ ప్రీమియం కూడా చెల్లించేందుకు అనుమతి ఇస్తాయి.

ఉమ్మడిగా పాలసీ తీసుకోవచ్చు!
MRTA for joint home loan : ఉమ్మడిగా తీసుకున్న గృహరుణాలకు కూడా ఎంఆర్​టీఏ పాలసీని తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి హోమ్ ​లోన్​ తీసుకున్నప్పుడు.. ఒకే పాలసీతో ఇద్దరికీ వర్తించేలా బీమా తీసుకోవచ్చు.

క్లెయిమ్ పరిస్థితి ఏమిటి?
Home loan MRTA claim process : అనుకోని దురదృష్ట పరిస్థితుల్లో రుణ గ్రహీత మరణించినప్పుడు బీమా సంస్థలు హోమ్ లోన్ మొత్తాన్ని తీర్చేస్తాయి. అదనంగా ఏదైనా మొత్తం మిగిలితే దానిని నామినీకి అందిస్తాయి. ఇవే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు ఈ పాలసీలో ఉంటాయి.

మనం ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇళ్లు మనకు, మన కుటుంబానికి నీడనిస్తుంది. కానీ మనం లేనప్పుడు కూడా మన కుటుంబం సురక్షితంగా ఉండాలి. జీవితంలో ప్రతి అమూల్యమైన దానికి బీమా భరోసా ఇవ్వలేదు. కానీ, మనపై ఆధారపడి ఉన్న వాళ్లకు మాత్రం ఆందోళన లేని జీవితాన్ని ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.