Highest Salary Paying Jobs : చదువు పూర్తయ్యాక అందరి దృష్టి జాబ్‌పైనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మంచి జీతంతో ఉద్యోగం సాధించాలని కోరుకుంటారు. అయితే చదువుకున్న వారందరికీ భారీ శాలరీతో కూడిన జాబ్ సాధ్యం కాకపోవచ్చు. కానీ, కష్టపడితే సాధించనిదంటూ ఏదీ ఉండదు. ఇకపోతే చాలా మంది తాము చదివిన చదువుకు సరిపడే ఉద్యోగం రాక.. వేరే జాబ్‌కు వెళ్లలేక సతమతమవుతారు. ఇక కొందరైతే ఎక్కువ జీతాలు పొందాలంటే కచ్చితంగా ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలనుకుంటారు. అయితే భారీ వేతనాలు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మన దేశంలోనే బాగా చదువుకొని ఈ ఉద్యోగాలు(Jobs) సంపాదిస్తే.. మీరు నెలకు లక్షల్లో పారితోషికాన్ని తీసుకోవచ్చు. వీటిలో ఉద్యోగం వస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం పెరిగేకొద్దీ ఇంకా పెద్దమొత్తంలో వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. మరి వాటిల్లో అత్యధిక జీతం ఇచ్చే 8 ఉద్యోగాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ : ఏ సంస్థకైనా మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ప్రధాన ఆయువు పట్టు. ఈ జాబ్ కోసం వీళ్లు ఎంట్రీ లెవల్లో కాస్త కష్టపడినా.. ఆ తర్వాత భారీ మొత్తంలో వేతనాన్ని పొందుతారు. కాబట్టి దేశంలో ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగుల్లో మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ఒకరని చెప్పుకోవచ్చు. వీరు ప్రారంభంలోనే నెలకు రూ. 3 నుంచి రూ. 4 లక్షలు సంపాదిస్తారు. అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది.
బిజినెస్ అనలిస్ట్ : మన దేశంలో వ్యాపారాల మధ్య పోటీ రోజురోజుకి పెరిగిపోతుంది. మార్కెట్‌లో సంస్థల మధ్య పోటీతత్వాన్ని విశ్లేషించేందుకు బిజినెస్ అనలిస్ట్ అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే వీళ్ల పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి ఎక్కువ జీతం పొందే ఉద్యోగాల్లో ఇది కూడా ఒకటి. ఈ జాబ్‌కి నెలకు రూ. 8 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ప్యాకేజీ ఇస్తుంటారు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు : సంస్థకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలోనూ, మూలధన పెట్టుబడులను సేకరించడంలోను వీరిది కీలక పాత్ర. సంస్థకు ఆర్థిక సలహాలను అందించేదీ వీరే. అయితే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ జాబ్‌కు స్థిరమైన జీతం లేకున్నా.. వీరు నెలకు రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ సంపాదిస్తుంటారు.
చార్టర్డ్ అకౌంటెంట్లు : వ్యాపార దక్షతలోనూ, అకౌంటింగ్‌లోనూ మంచి పట్టు ఉన్నవారు చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతారు. ఈ వృత్తిలోని వారికి మన దేశంలో ఎంతో గౌరవం ఉంది. వీరు కూడా బాగానే సంపాదిస్తుంటారు. అనుభవం ఉన్న వారు నెలకు రూ.5 లక్షల నుంచి రూ.24 లక్షల వరకూ వసూలు చేస్తుంటారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే! జాబ్ గ్యారెంటీ! అవేంటో తెలుసా?
న్యాయ నిపుణులు : ఈ వృత్తిలో స్థిరపడిన వారు కూడా బాగానే సంపాదిస్తారు. టాప్ మోస్ట్ లాయర్లయితే ఒక్కో కేసును వాదించేందుకు భారీగానే డిమాండ్ చేస్తారు. వీరు కేసులను బట్టి.. నెలకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తుంటారు.
ఐటీ ఇంజినీర్స్ : భారీ వేతనాలిచ్చే వాటిలో ఇదో ఎవర్‌గ్రీన్ వృత్తిగా భావించవచ్చు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఐటీ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. వీరు కూడా నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ సంపాదిస్తుంటారు.
డిజిటల్ మార్కెటింగ్ : ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్‌ను సాధన చేసిన మంచి పట్టు సాధిస్తే దేశంలో ఉన్న టాప్ కంపెనీల్లో స్థానం సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో నిపుణులు నెలకు లక్షల్లోనే వేతనం పొందుతుంటారు.
విమానయాన రంగ వృత్తి : ఆకాశమే హద్దుగా వారి వృత్తి ఉంటుంది. ఇందులోనూ మంచి జీతాలు ఉంటాయి. ఈ రంగంలో జాబ్ సాధించిన వారు కూడా నెలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంది.
గవర్న్మెంట్ జాబ్ కావాలా? వేల పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్- అప్లై చేసుకోండిలా!