Harley-Davidson X 350 India Launch and Price Details Telugu: ప్రపంచ రోడ్లపై దూసుకెళ్లే.. హై ఎండ్ బైక్ లలో హార్లీ డేవిడ్సన్ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంటుంది. విశ్వవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఈ బ్రాండ్ ధర కూడా అధికంగానే ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బ్రాండ్ తక్కువ ధరే.. 6 లక్షలు! ఇక హయ్యెస్ట్ కాస్ట్ ఏకంగా 60 లక్షల దాకా ఉంది. అలాంటిది.. ఇప్పుడు అతి తక్కువ ధరతో సరికొత్త మోడల్ ను లాంఛ్ చేయబోతోంది హార్లీ డేవిడ్సన్ యాజమాన్యం.
ఈ కొత్త మోడల్ పేరు.. హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 (Harley-Davidson X350). ఈ మోడల్ ఇప్పటికే చైనాలో రిలీజ్ చేశారు. ఈ డిసెంబర్లో గా ఇండియాలో లాంఛ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ న్యూ బైక్ మోడల్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఓలా నుంచి కొత్త ఈ-బైక్స్.. రూ.80వేల కన్నా తక్కువకే.. ఇంజిన్ బైక్‌ల పని అయిపోయినట్టే!
హార్లీ డేవిడ్సన్ X350 స్పెసిఫికేషన్స్:
Specifications of Harley Davidson X350: గతంలో డిస్‌కంటిన్యూ చేసిన స్పోర్ట్ స్టార్ XR1200X ఆధారంగా హార్లీ డేవిడ్సన్ X350 బైక్‌ను తయారు చేశారు. ఇది సర్క్యులర్ హెడ్ ల్యాంప్ క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది. ఇదే డిజైన్‌లో సర్క్యులర్ మోనోపాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తోంది. 350cc టూ-వీలర్‌లో టియర్ డ్రాప్డ్ షేప్డ్ ఇంధన ట్యాంక్ ఉంది.
హార్లీ డేవిడ్సన్ X350 ఫీచర్స్ :
Features of Harley Davidson X350: ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్లు అమర్చినట్లు తెలుస్తోంది. ఫ్రంట్ సైడ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, బ్యాక్‌సైడ్ మోనో షాక్‌ను అందిస్తుంది. హార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిల్ 17-అంగుళాల ఎల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఎల్లాయ్ వీల్స్ ముందు 120/70-17 టైర్, వెనుక 160/60-17 టైర్‌తో వస్తాయి. అలాగే వీల్ సైజ్.. ముందు భాగం 431.8 mm, వెనుక భాగం 431.8 mm ఉంటుంది. అలాగే ఈ బైక్ టైర్లు ట్యూబ్‌లెస్ తో ఉంటాయి.
New Electric Bike In India : స్టన్నింగ్ ఫీచర్స్‌తో టోర్క్ మోటార్స్ ఈ-బైక్ లాంఛ్.. ధర ఎంతంటే?
హార్లీ డేవిడ్సన్ X350 సామర్థ్యం:
Ability of Harley Davidson X350: హార్లీ డేవిడ్సన్ X350 బ్రేక్‌లో.. నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో ముందువైపు ఒకే డిస్క్.. అదే విధంగా వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే డిస్క్ ఉంటుంది. 353 cc ప్యార్లల్-ట్విన్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో పొందుపర్చారు. ఈ ఇంజన్ 36.2 బీహెచ్‌పీ, 31 ఎన్ఎమ్ మోటార్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. అంటే.. పుల్ట్యాంక్ పెట్రోల్‌తో దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. ఈ బైక్ బరువు సుమారు 195 కిలోలు.
బైక్ కలర్స్ :
Harley Davidson X 350 Colours: చైనాలో ఈ బైక్ జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ వంటి కలర్లలో లభిస్తోంది. ఇండియాలో కూడా ఇవే కలర్లు ఉండొచ్చని సమాచారం.
ఇండియాలో Harley Davidson X 350 లాంఛింగ్ : Harley Davidson X350 బైక్.. ఈ డిసెంబర్ చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఇక దీని ప్రారంభ ధర 2.50 లక్షల మేర ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో Harley-Davidson X 350 బుక్ చేయడం ఎలా?
How To Book Harley-Davidson X 350 Online?:
- ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి www.harley-davidson.com అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హార్లీ -డేవిడ్‌సన్ X 350 ఎంచుకోండి.
- మీ రాష్ట్రం, నగరం, ఆపై సమీప Harley-Davidson డీలర్‌ను ఎంచుకోండి.
- Harley-Davidson X 350 ప్రతినిధిని చేరుకోవడానికి మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
- Harley-Davidson X 350 బుకింగ్ కోసం ఆన్‌లైన్ లో డబ్బు మొత్తాన్ని చెల్లించాలి.
- చెల్లింపు నిర్ధారణ తర్వాత.. మరిన్ని వివరాల కోసం టీమ్ హార్లే-డేవిడ్‌సన్ నుంచి కాల్ అందుకుంటారు.