ETV Bharat / business

ఫోన్లకు ఫేక్​ మెసేజ్​.. ఎస్​బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక! - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Fake Message Alert: ఎస్​బీఐ కస్టమర్ల ఫోన్లకు మీ బ్యాంక్​ ఖాతా బ్లాక్ చేశారని, సంబంధిత వివరాలతో మళ్లీ పునరుద్ధరించుకోండని ఓ ఫేక్​ మెసేజ్ ఇటీవలే వస్తోంది. ఆ మెసేజ్​తో పాటే ఓ లింక్​ కూడా దర్శనమిస్తోంది. అయితే అది ఫేక్ మెసేజ్ అని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

government-warns-of-fake-sbi-sms-threat
government-warns-of-fake-sbi-sms-threat
author img

By

Published : May 22, 2022, 8:01 PM IST

SBI Fake Message Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్‌. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే report.phishing@sbi.co.inకు నివేదించాలని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది.

అయితే, ఎస్‌బీఐ బ్యాకింగ్‌కు సంబంధించి ఫేక్‌ మెసేజ్‌లు సర్క్యూలేట్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ చాలా మంది ఎస్‌బీఐ కస్టమర్లకు.. కేవైసీ నిబంధనలను పాటించనందుకు తమ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ లింక్‌ ఇచ్చి కేవైసీని అప్‌డేట్‌ చేయమని కేటుగాళ్లు కోరారు. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ఎస్‌బీఐ అప్రమత్తం చేసంది.

ఇవీ చదవండి: గూగుల్​పే, ఫోన్​పే చేస్తున్నారా? ఇలా మోసపోవచ్చు! బీ అలర్ట్!!

స్టాక్​ మార్కెట్లలో కలిసిరావట్లేదా? ఇది కాస్త బెటరేమో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.