ETV Bharat / business

క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ? - జీఎస్​టీ ఆన్​లైన్​ గేమింగ్​

Casino Online Gaming GST: దేశంలోని క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై జీఎస్‌టీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ వేసిన మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వాటిపై 28 శాతం జీఎస్​టీ వేయాలని పేర్కొంది. అయితే ఈ విషయంపై త్వరలో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ.. త్వరలో అధికారిక నిర్ణయం

author img

By

Published : May 18, 2022, 9:42 PM IST

Casino Online Gaming GST: క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఎంత జీఎస్‌టీ విధించాలన్న అంశంపై మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిపై 28 శాతం జీఎస్‌టీ వేయాలని పేర్కొంటూ తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

దేశంలోని క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై జీఎస్‌టీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఓ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఈ కమిటీ ఈ నెల మొదటి వారంలో సమావేశమైంది. క్యాసినోలు, రేస్‌కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తాజాగా మంత్రుల కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నివేదికను రూపొందించింది. "క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్‌టీ విషయంలో మంత్రుల కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తాం" అని సంగ్మా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ నెలాఖరులో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.

క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఈ సేవల విలువను అంచనా వేయడంతో పాటు వాటి నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు గతేడాది జూన్‌లో ఈ కమిటీ ఏర్పాటైంది. సంబంధిత విషయాలపై చట్టపరమైన నిబంధనలు, కోర్టు ఆదేశాలను మంత్రుల బృందం పరిగణనలోకి తీసుకుంది. అలాగే కాసినోలు, రేస్ కోర్సులు, ఆన్‌లైన్ గేమింగ్‌లకు సంబంధించి రూపొందించే కొత్త మదింపు పద్ధతులను అమలు చేయడానికి ఇప్పటికే ఉన్న చట్టాల్లో సాధ్యమయ్యే మార్పులపై కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి: ఒక్కసారి ఛార్జింగ్​తో 140 కి.మీ. జర్నీ.. టీవీఎస్​ సరికొత్త ఈ-బైక్

ఒక్కసారి ఛార్జింగ్​తో 140 కి.మీ. జర్నీ.. టీవీఎస్​ సరికొత్త ఈ-బైక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.