Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి.. ప్రస్తుతం రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.67,700 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,200గా ఉంది. కిలో వెండి ధర రూ.67,700 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,700గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,700 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,700గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1841.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.80 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,63,275 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,63,275 |
ఇథీరియం | రూ.1,37,948 |
టెథర్ | రూ.82.66 |
బైనాన్స్ కాయిన్ | రూ.26,000 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.64 |
స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 360 పాయింట్లు లాభపడి 61,630 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్లు ఎగబాకి 18,122 దగ్గర ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్ర, సన్‌ఫార్మా, రిలయన్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్ లాభాల్లో కొనసాగుతుండగా.. మారుతీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్జర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు పెరిగి.. 82.66 దగ్గర ట్రేడవుతోంది.