Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.78 పెరిగి.. ప్రస్తుతం రూ.58,338 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 1268 తగ్గి.. ప్రస్తుతం రూ. 69,621 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,338 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,621 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,338 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,621 గా ఉంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,338 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,621 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,338 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,621 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1909.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.43 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,92,323 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,92,323 |
ఇథీరియం | రూ.1,24,310 |
టెథర్ | రూ.81.33 |
బైనాన్స్ కాయిన్ | రూ.23,660 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.34 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 215 పాయింట్ల నష్టపోయి 60,829 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 18,101 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో కొటక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్సెర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హింతుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, నెస్లే షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు నష్టపోయి 81.45 వద్ద ట్రేడవుతోంది.