Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి ప్రస్తుతం రూ.55,170వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.344 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.66,524వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,170గా ఉంది. కిలో వెండి ధర రూ.66,524 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,170వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,524గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,170 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,524వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,170వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,524గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.1772.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.29డాలర్ల వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,95,247 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.14,03,094 |
ఇథీరియం | రూ.1,03,669 |
టెథర్ | రూ.82.45 |
బైనాన్స్ కాయిన్ | రూ.23,818 |
యూఎస్డీ కాయిన్ | రూ.80.42 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉండడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. మెటా షేర్లు ఆరు శాతం మేర నష్టపోవడం అక్కడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్ మార్కెట్లు సైతం నష్టాల్లో చలిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 62,582 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 18,628 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.57 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివి
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, విప్రో, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తగ్గిన రూపాయి విలువ..
ట్రేడింగ్‌లో డాలర్కంటే 25 పైసలు తగ్గిన రూపాయి విలువ ప్రస్తుతం రూ. 82.75కు చేరుకుంది.