Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.320 తగ్గి.. ప్రస్తుతం రూ.51,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.540 తగ్గి.. రూ.57,530 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,900గా ఉంది. కిలో వెండి ధర రూ.57,530 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,530గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,530 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,530 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1700 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.29 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,21,055 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,21,055 |
ఇథీరియం | రూ.1,26,778 |
టెథర్ | రూ.79.59 |
బినాన్స్ కాయిన్ | రూ.22,190 |
యూఎస్డీ కాయిన్ | రూ.79.57 |
Stock Market Updates : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం.. సెన్సెక్స్ 718 పాయింట్లు, నిఫ్టీ 198 పాయింట్ల భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 593.55 పాయింట్లు నష్టపోయి 59,970 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 17,906.35 దగ్గర ట్రేడవుతోంది. టాప్ 30 సూచీల్లో సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, మారుతీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి
రూపాయి విలువ: బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 41 పైసలు నష్టపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 79.58కు చేరింది.
ఇవీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ
భారత్‌లో తొలి చిప్ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!