Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం శనివారంతో పోల్చితే రూ.151 తగ్గి రూ.61,114కు చేరింది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శనివారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.205 తగ్గుముఖం పట్టి.. ప్రస్తుతం రూ.77,360 పలుకుతోంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,114గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360గా ఉన్నది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,114గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,114గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360గా ఉన్నది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,114గా ఉంది. కిలో వెండి ధర రూ.77,360గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1955 డాలర్లు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 24.85 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,89,770 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్లు కుడా లాభాల్లో కొనసాగుతున్నాయి. బైనాన్స్ కాయిన్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,89,770 |
ఇథీరియం | రూ.1,58,795 |
టెథర్ | రూ.82.18 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,952 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.16 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
స్టాక్‌మార్కెట్ న్యూస్!
Stock market Today : విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఐటీ షేర్ల కొనుగోళ్ల మధ్య సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 128.6 పాయింట్లు లాభపడి 66,190 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 47.65 పాయింట్లు వృద్ధి చెంది 19,612 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
విప్రో, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనిలివర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, లార్సన్ అండ్ టుబ్రో సంస్థలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వృద్ధి చెందుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 6 పైసలు పెరిగి రూ.82.11 వద్ద కొనసాగుతోంది.