ETV Bharat / business

Gold Rate Today : షాక్​ ఇస్తున్న గోల్డ్​, సిల్వర్​​​ ధరలు.. ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - stock market news in telugu

Gold Price Today : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today
Gold Rate Today
author img

By

Published : Jul 11, 2023, 11:14 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.80 పెరిగి మంగళవారం రూ.60,580గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.510 వృద్ధి చెంది రూ.73,030కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,580గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,030కు చేరుకుంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030కు చేరుకుంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1921 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 10 డాలర్లు వృద్ధి చెంది 1930 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 23.27 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ మళ్లీ ఊపందుకుంది. బిట్​కాయిన్​ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.25,06,650 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​, యూఎస్​డీ కాయిన్స్​ మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,06,650
ఇథీరియంరూ.1,54,611
టెథర్బైనాన్స్
బైనాన్స్ కాయిన్ రూ.20,336
యూఎస్​డీ కాయిన్​రూ.82.37

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : దేశీయ స్టాక్​మార్కెట్లు మంగళవారం కూడా తమ లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు సహా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 421 పాయింట్లు లాభపడి 65,765 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 131 పాయింట్లు వృద్ధి చెంది 19,486 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : మారుతి సుజుకి, పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్​, ఐటీసీ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంకు

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ కాస్త వృద్ధి చెందుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 21 పైసలు పెరిగి రూ.82.38 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.