Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.150 పెరిగి బుధవారం రూ.60,300గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.120 పెరిగి రూ.71,820కు చేరింది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,300గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,300గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820కు చేరింది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,300గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,300గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820కు చేరింది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1924 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 2 డాలర్లు లాభపడి 1926 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.94 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ మంగళవారంతో పోల్చితే బుధవారం కాస్త తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.25,31,601 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ కాయిన్స్ మాత్రం లాభాలతో ట్రేడవుతున్నాయి. మొదలైన క్రిప్టో కరెన్సీలు కూడా లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.25,31,601 |
ఇథీరియం | రూ.1,59,076 |
టెథర్ | రూ.82.8 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,972 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.13 |
స్టాక్‌మార్కెట్ న్యూస్
Stock market today : దేశీయ స్టాక్‌మార్కెట్ల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 65,436 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 19,386 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్.
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, విప్రో, టాటా మోటార్స్, టైటాన్
రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్థిరంగానే ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 7 పైసలు తగ్గి రూ.82.08 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.