ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..

Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,600గా ఉంది. కిలో వెండి ధర రూ.62,400గా ఉంది. మరోవైపు దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

gold price today
gold price today
author img

By

Published : Jun 28, 2022, 10:07 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.180 తగ్గి.. రూ.62,400 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంది. కిలో వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,600గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,400గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 1826 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.26 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.17,31,800 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,31,800
ఇథీరియంరూ.98,620
టెథర్రూ.83.62
బినాన్స్​ కాయిన్రూ.19,579
యూఎస్​డీ కాయిన్రూ.83.71

నష్టాల్లో మార్కెట్లు: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. గత మూడు రోజులు పరుగులు తీసిన సూచీలు మంగళవారం చతికిలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. కీలక రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ 15,800 దిగువన ట్రేడ్‌ అవుతోంది.

ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 254 పాయింట్లు దిగజారి 52,907 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 15,749 వద్ద కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు రాణిస్తుండగా.. ఏషియన్స్‌ పెయింట్స్‌, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 78.57 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇదీ చదవండి: స్టాక్​ మార్కెట్లోకి తొలి అడుగు.. 'సూచీ ఫండ్ల'తో మేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.