Gold Rate Today 4th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,205గా ఉండగా.. సోమవారం రూ.195 పెరిగి రూ.61,400 వద్దకు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.75,764గా ఉండగా.. సోమవారం రూ.151 పెరిగి రూ.75,915కు చేరింది.
- Gold Price In Hyderabad 4th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,915గా ఉంది.
- Gold Price In Vijayawada 4th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,915కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 4th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,195గా ఉంది.
- Gold Price In Proddatur 4th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,195కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1940 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.29డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 4th September 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,47,489 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,47,489 |
ఇథీరియం | రూ.1,35,422 |
టెథర్ | రూ.82.64 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,773 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.70 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 4th September 2023 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ జీడీపీ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడం, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 102 పాయింట్లు లాభపడి 65,489 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు వృద్ధి చెంది 19,478 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, విప్రో, ఎన్టీపీసీ, టీసీఎస్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, టైటాన్
రూపాయి విలువ!
Rupee Open 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి రూ.82.75 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 4th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Priece Today 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.05 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 88.59 డాలర్లుగా ఉంది.