Gold Rate Today 31st August 2023 : దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,003గా ఉండగా.. గురువారం రూ.203 పెరిగి రూ.61,226కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,870గా ఉండగా.. గురువారం నాటికి రూ.60 తగ్గి రూ.76,810కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 31st August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,226గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
- Gold Price In Vijayawada 31st August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 31st August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,226గా ఉంది. కిలో వెండి ధర రూ.76,810కు చేరుకుంది.
- Gold Price In Proddatur 31st August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1937 డాలర్లుగా ఉండగా.. గురువారం 1945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.59 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st August 2023 : గురువారం ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,46,533 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,46,292 |
ఇథీరియం | రూ.1,40,292 |
టెథర్ | రూ.82.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,395 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.64 |
Stock Market Today 31st August 2023 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, జీడీపీ అంచనాలు మొదలైన అంశాలపై.. ఒక స్పష్టత రావాల్సిన తరుణంలో, మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు లాభపడి 65,14 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 10 పాయింట్లు వృద్ధిచెంది 19,346 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : జియోఫిన్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, టైటాన్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు: ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా
రూపాయి విలువ!
Rupee Open 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి రూ.82.68 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 31st August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Price Today 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు ధర 85.74 డాలర్లుగా ఉంది.