Gold Rate Today 29th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.59,750 ఉండగా.. శుక్రవారం రూ.200 తగ్గి రూ.59,550కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.72,345గా ఉండగా.. రూ.825 తగ్గి రూ.73,170కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 29th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,550గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,170గా ఉంది.
- Gold Price In Vijayawada 29th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 29th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170గా ఉంది.
- Gold Price In Proddatur 29th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1875 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 10 డాలర్లు తగ్గి 1865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.86 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 29th September 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,36,332 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,36,332 |
ఇథీరియం | రూ.1,37,186 |
టెథర్ | రూ.83.8 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,845 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.12 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 65,743 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగబాకి 19,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అరబిందో ఫార్మసీ, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్, వోడాఫోన్ ఐడియా, ఐండస్ టవర్స్.
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : నవిన్ ఫ్లోరిన్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, డెల్టా కార్పొరేషన్, పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్.
రూపాయి విలువ!
Rupee Open 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి రూ.83.10 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 29th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 91.85 డాలర్లుగా ఉంది.
How to Use SBI WhatsApp Banking Services : వాట్సాప్‌లో SBI సేవలు.. ఏం చేయొచ్చంటే..?