Gold Rate Today 12th September 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,885గా ఉండగా.. మంగళవారం రూ.797 తగ్గి రూ.60,088 వద్దకు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,070గా ఉండగా.. మంగళవారం రూ.425 పెరిగి రూ.73,495కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 12th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,088గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,495గా ఉంది.
- Gold Price In Vijayawada 12th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 12th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495గా ఉంది.
- Gold Price In Proddatur 12th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1923 డాలర్లు ఉండగా.. మంగళవారం కూడా అదే ధర వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.18డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,44,363 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,44,363 |
ఇథీరియం | రూ.1,31,629 |
టెథర్ | రూ.82.95 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,385 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.99 |
లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 50@20,110 ఆల్‌టైమ్ న్యూ హైరికార్డ్!
Stock Market Today 12th September 2023 : వరుసగా 8వ రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఫలితంగా నిఫ్టీ 50 తొలిసారి 20,110 పాయింట్లు ఎగబాకి న్యూ హైరికార్డ్ నమోదు చేసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 172 పాయింట్లు లాభపడి 67,299 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు వృద్ధిచెంది 20,002 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫీ, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, విప్రో, టైటన్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, మారుతీ, రిలయన్స్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ.
రూపాయి విలువ!
Rupee Open 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ 10 పైసలు ఎగబాకి రూ.82.93 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 12th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.92గా ఉంది. డీజిల్ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు!
Crude Oil Price 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.39 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 90.99 డాలర్లుగా ఉంది.