Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గురువారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర వృద్ధి చెందింది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.310 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,820గా ఉంది. కిలో వెండి ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,820 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,500గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,793 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.31 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,21,996 పలుకుతోంది. ఇథీరియం రూ.2వేలకు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.1,37,865 వద్ద కొనసాగుతోంది.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,21,996 |
ఇథీరియం | రూ.1,37,000 |
టెథర్ | రూ.83.28 |
బినాన్స్ కాయిన్ | రూ.26,111 |
యూఎస్డీ కాయిన్ | రూ.84.51 |
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు పెరిగి.. 58,580 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 75 పాయింట్లకుపైగా ఎగబాకి.. 17,450 వద్ద కొనసాగుతోంది. అల్ట్రా సెమ్కో, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐఎన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి: శుక్రవారం రూపాయి విలువ పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 46 పైసలు పెరిగి.. 79.94 వద్ద ట్రేడవుతోంది.
ఇదీ చదవండి: వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం