Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.440 ప్రియమైంది. కేజీ వెండి వరుసగా రెండో రోజూ రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,640గా ఉంది. కిలో వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,040గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 19 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,971 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.52 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్లు: మరోవైపు, స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో ప్రారంభమైనప్పటికీ.. క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో 58,530 పాయింట్ల వద్ధ కొనసాగుతోంది. నిఫ్టీ సైతం అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. స్వల్ప నష్టంతో.. 17,531 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు రాణిస్తున్నాయి. హాంకాంగ్, సియోల్, టోక్యో షేర్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు, షాంఘై స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి.
• అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 104.69 డాలర్లుగా ఉంది.
• రూపాయి మారకం విలువ 6 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు మారకం విలువ రూ.76.21గా ఉంది.
Cryptocurrency rates: క్రిప్టోకరెన్సీ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర(రూ.ల్లో) |
బిట్‌కాయిన్ | 30,58,000 |
ఇథీరియం | 2,33,000 |
డోజ్కాయిన్ | 10.73 |
టెథర్ | 76.21 |
బీఎన్బీ కాయిన్ | 32,000 |
ఇదీ చదవండి: ఆ విమాన సంస్థకు డీజీసీఏ షాక్.. 90 మంది పైలట్లపై నిషేధం