Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.850 పెరిగి రూ.68,300 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉంది. కిలో వెండి ధర రూ.68,300 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,300 గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,300 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,300 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,800.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.17 డాలర్ల వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.14,11,813 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.14,11,813 |
ఇథీరియం | రూ.1,05,670 |
టెథర్ | రూ.81.56 |
బైనాన్స్ కాయిన్ | రూ.24,108 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.66 |
ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం సోమవారం దిల్లీలో ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం 6శాతం కంటే ఎక్కువగా ఉన్నందున మళ్లీ వడ్డీరేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కమిటీ నిర్ణయం కోసం.. దేశీయ మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ ఇప్పటికే మే నుంచి కీలకమైన పాలసీ రేటును 190 బేసిస్ పాయింట్ల మేర.. 5.9 శాతానికి పెంచింది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 6.77శాతంగా ఉంది.
ష్టాక్ మార్కెట్లు..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు తగ్గి 62,765 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 18,672 వద్ద కొనసాగుతోంది.
హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, పవర్ గ్రిడ్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ఇవీ చదవండి: