Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం సుమారు రూ.140 దిగొచ్చింది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి దాదాపు రూ.670 మేర పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,000గా ఉంది. కిలో వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,760గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,760 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగానూ బంగారం ధర దిగొచ్చింది. ఔన్సు బంగారం 12 డాలర్లు దిగువన ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,920 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.29 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్లు డీలా: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 450 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 59,727 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 114 పాయింట్లు కోల్పోయి.. 17,843 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, రియాల్టీ, ఐటీ సెక్టార్లలో షేర్లులో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: మరోవైపు దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.47కు చేరింది. డీజిల్ ధర రూ.105.47కు ఎగబాకింది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.121.26కు చేరింది. డీజిల్ ధర 83 పైసలు పెరిగి.. రూ.106.87కు చేరుకుంది. వైజాగ్‌లో 88 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.98కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.105.63కు ఎగబాకింది.
ఇదీ చూడండి: అగ్రస్థానం అంబానీదే.. అత్యంత చేరువలో అదానీ