Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300కు పైగా పెరిగింది. కిలో వెండి రూ.40 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,270గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,320గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,320గా ఉంది. కిలో వెండి ధర రూ.64,270 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,320వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,270గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,270వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,270వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,883 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.39 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.50, లీటర్ డీజిల్ రూ. 104.75.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.105.63 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
Domestic LPG cylinder: గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1052కి చేరింది.
వాణిజ్య సిలిండర్: కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి చమురు సంస్థలు. మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరింది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.655కు పెంచారు. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇది చదవండి: రిలయన్స్ @100 బిలియన్ డాలర్లు.. ఏకైక దేశీయ కంపెనీగా అరుదైన రికార్డ్