Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.240 పెరిగి.. రూ.52,240 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.1250పైగా పెరిగి.. రూ.62,800గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,240గా ఉంది. కిలో వెండి ధర రూ.62,800 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,240గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,800గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ. 62,800 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,800 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1833 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.68 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.06 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.18,46,412 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.18,46,412 |
ఇథీరియం | రూ.99,923 |
టెథర్ | రూ.82.85 |
బినాన్స్ కాయిన్ | రూ.19,045 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.88 |
Stock Market: దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 416 పాయింట్లకుపైగా పెరిగి 52 వేల 958 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 15 వేల 806 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్, టాటాస్టీల్, మారుతీ, ఐసీఐసీఐ, ఏషియన్ పెయింట్స్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి. కోటక్ బ్యాంక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి.
ఇవీ చదవండి: 'పసిడి'పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?