Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.430 పెరిగి రూ.54,150 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.100 పెరిగి.. రూ.60,100 వద్ద కదలాడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,150గా ఉంది. కిలో వెండి ధర రూ.60,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,100గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,100 వేల వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,792 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.41 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్ విలువ రూ.13,657 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,98,999 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.20,12,656 |
ఇథీరియం | రూ.1,61,372 |
టెథర్ | రూ.84.15 |
బినాన్స్ కాయిన్ | రూ.26,960 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.52 |
స్టాక్ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్పల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్.. 100 పాయింట్ల లాభంతో 59,410 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 45 పాయింట్లు లాభపడి 17,510 వద్ద కదలాడుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఎస్బీఐ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ షేర్లు లాభాల్లో ఉండగా.. హెడ్ఎఫ్సీ, టాటా కాన్స్, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం స్వల్పంగా తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో 9 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 79.71కు చేరింది.
ఇవీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు!
ఆన్లైన్ రుణాలపై ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు! ఇకపై ఆ సమాచారమంతా ఇవ్వాల్సిందే