తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల పసిడి ధర రూ.53,060 ఉండగా.. కిలో వెండి ధర రూ.59,540 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,060గా ఉంది. కిలో వెండి ధర రూ.59,540 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,060 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,540గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,060గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,540వద్ద కొనసాగుతోంది
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,060గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,540 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1760 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.14 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 79.18 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: ఒక బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.19,43,900 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,43,900 |
ఇథీరియం | రూ.1,39,983 |
టెథర్ | రూ.82.43 |
బినాన్స్ కాయిన్ | రూ.23,747 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.15 |
Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ దాదాపు 360 పాయింట్లు పెరిగి.. 57,930 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 110 పాయింట్లకుపైగా పెరిగి.. 17,270 వద్ద కొనసాగుతోంది. ఎం&ఎం, రిలయన్స్, మారుతీ, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ఉండగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్జర్వ్, ఎన్టీపీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు.. ఎంతంటే...
ఐటీ రిటర్నుల వెల్లువ.. ఒకేరోజు 54లక్షలు.. గంటలో 5లక్షలకు పైగా..