ETV Bharat / business

ప్రపంచ దేశాలపై 'డీజిల్‌ పిడుగు'.. భారత్​కు మాత్రం లాభమే! - ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత

రానున్నకొన్నినెలల్లో ప్రపంచమంతా డీజిల్​ కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. చమురు విపణుల నుంచి సరఫరాలు భారీగా తగ్గుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, కొవిడ్‌-19లు సైతం దీనికి ప్రధాన కారణంగా ఉన్నాయి. అయితే ఈ పరిణామాలు పరోక్షంగా భారత్‌, చైనా లాంటి దేశాలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

global diesel crisis
ప్రపంచ దేశాలపై డీజిల్‌ పిడుగు
author img

By

Published : Nov 27, 2022, 7:31 AM IST

World Diesel Crisis: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డీజిల్‌కు ఉన్న ప్రాధాన్యమే వేరు. ట్రక్కులు, బస్సులు, ఓడలు, రైళ్లు నడిచేందుకు.. నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగాల్లో వినియోగించే యంత్రాలకు కావాల్సిన ఇంధనం ఇదే. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఇంటి వెచ్చదనం కోసమూ డీజిల్‌నే ఇంధనంగా ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల విద్యుదుత్పత్తికీ వాడతారు. ఇన్ని రకాల అవసరాలను తీర్చే డీజిల్‌కు రానున్న రోజుల్లో కొరత ఏర్పడనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అసలే అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. డీజిల్‌కు కొరత ఏర్పడితే ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక, పాకిస్తాన్‌ లాంటి పేద దేశాల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది.

రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచ దేశాలకు డీజిల్‌ కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన చమురు విపణుల నుంచి సరఫరాలు తగ్గుతున్నాయి. అమెరికా, ఐరోపాల్లో డీజిల్‌ నిల్వలు కనిష్ఠ స్థాయిలకు చేరుతుండగా, శీతకాలం నేపథ్యంలో ఇంటి వెచ్చదనం కోసం డీజిల్‌ వినియోగం పెరుగుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల నిషేధానికి ఐరోపా కూటమి విధించుకున్న గడువు సమీపిస్తుండటం ఆందోళనను పెంచుతోంది.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా తగ్గింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ఆంక్షల సమయంలో డిమాండు తగ్గినపుడు, కొన్ని రిఫైనరీలు లాభదాయకత లేని ప్లాంట్లను మూసివేశాయి. దీంతో రిఫైనింగ్‌ సామర్థ్యమూ పరిమితమైంది. 2020 నుంచి అమెరికాలో రిఫైనింగ్‌ సామర్థ్యం రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు అంచనా. అమెరికాలో డీజిల్‌, హీటింగ్‌ ఆయిల్‌ నిల్వలు నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయని వార్తలొస్తున్నాయి.

ఐరోపాలో ఎగుమతిపరమైన అవరోధాలు, సిబ్బంది సమ్మెతో రిఫైనింగ్‌ సామర్థ్యంపై ప్రభావం పడింది. ఇక్కడా డీజిల్‌ నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయన్నది అంచనా. రష్యా నుంచి చమురు దిగుమతుల నిషేధాన్ని 2023లో అమల్లోకి తేవాలన్నది ఐరోపా కూటమి ప్రణాళిక. ప్రపంచంలో అత్యధికంగా డీజిల్‌పై ఆధారపడేది ఐరోపా కూటమే. ఆ దేశాలు ఏడాదికి దిగుమతి చేసుకునే 50 కోట్ల బ్యారెళ్ల డీజిల్‌లో సగం వరకు రష్యా నుంచే ఉంటాయి. అమెరికా ఇప్పటికే రష్యా నుంచి దిగుమతులను నిలిపివేసింది. ఈ పరిణామాలతో డీజిల్‌ కొరత మరింత తీవ్రం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

మనకు లాభమా?
ఈ పరిణామాలు పరోక్షంగా భారత్‌, చైనా లాంటి దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయనున్న ఐరోపా కూటమికి.. ఈ దేశాలు డీజిల్‌ ఎగుమతులను పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికల్లా చైనా ఇంధన ఎగుమతులు రోజుకు 5,00,000 బ్యారెళ్లు పెరిగి 1.2 మిలియన్‌ బ్యారెళ్లకు చేరే అవకాశం ఉందని ఓ విశ్లేషణ సంస్థ అంచనా వేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత వల్ల, ముడిచమురు ధర పెరిగితే వర్థమాన దేశాలకు ఇబ్బందులు తప్పవు.

పెరిగిన ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా డీజిల్‌పై పన్ను కోతను థాయ్‌లాండ్‌ పొడిగించింది. సరఫరాను పెంచే నిమిత్తం దేశీయ ఇంధన ఉత్పత్తిదార్లకు మరిన్ని రుణాలివ్వడం లాంటి అత్యవసర చర్యలను చేపట్టడంపై వియత్నాం దృష్టి సారిస్తోంది. మొత్తానికి డీజిల్‌ కొరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు తీసుకు రావొచ్చని.. కొత్త రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత మేర బయటపడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.