Flipkart Republic Day sale 2024: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఇ కామర్స్ సైట్‌లు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులను తమ వైపు తిప్పుకోడానికి సూపర్ సేల్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫ్లిప్‌కార్ట్ చేరింది. జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024ను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. మరి ఈ సేల్‌లో ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వందలాది డీల్స్‌పై అద్భుతమైన ఆఫర్లు: ఈ రాబోయే సేల్‌లో వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లను అందిస్తుంది. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టీవీలు వంటి ప్రొడక్టులపై డీల్‌లు, డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్‌లు లభిస్తాయి. ఆపిల్, శాంసంగ్, గూగుల్, రియల్‌మితో సహా బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు సేల్ సమయంలో ధర తగ్గింపులను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్- ఆరోజే ప్రారంభం- వాటిపై సూపర్ ఆఫర్స్!
స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల విషయానికొస్తే.. మోటోరొలా ఎడ్జ్ 40 నియో (motorola edge 40neo), గూగుల్ పిక్సెల్ 7ఎ (Google Pixel 7a), శాంసంగ్ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ (Samsung S21 FE 5G), రియల్‌మీ 11 ఎక్స్ 5జీ (Realme 11X 5G), శాంసంగ్ ఎఫ్14 5జీ (Samsung S14 5G), మోటో జీ54 5జీ (moto G54 5G), రియల్‌మీ సీ 53 (realme C53) సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
కొత్త లాంచ్‌లు మరియు ప్రత్యేకమైన ఆఫర్‌లు: రిపబ్లిక్ డే సేల్ డిస్కౌంట్లను తీసుకురావడమే కాకుండా కొత్త ఉత్పత్తుల లాంఛ్‌లను కూడా ప్రదర్శిస్తుంది. Vivo X100 సిరీస్, Oppo Reno 11 సిరీస్, Infinix Smart 8, Redmi Note 13 Pro సిరీస్, Poco X6 సిరీస్‌ల నుంచి ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనుంది. ఈ సేల్‌లో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఉంటాయి.
మెటర్నిటీ బీమాతో ఆర్థిక రక్షణ- పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి!
ఇతర ఉత్పత్తులపై కూడా.. ఇక ఫ్యాషన్ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం... అప్లయెన్సస్‌పై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. బ్యూటీ, ఫుడ్, టాయ్స్‌పై 85 శాతం వరకు, ఫర్నిచర్‌లపై 80 శాతం వరకు పొందొచ్చు. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే పేమెంట్లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఆదా చేసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ఏయే బ్యాంకు కార్డులపై ఇస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు.
కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసా? మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
రెడ్మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్- ఐఫోన్ కంటే సూపర్ కెమెరా!- ధర ఎంతంటే?
అమెజాన్ ప్రైమ్ Lite ప్లాన్‌పై భారీ డిస్కౌంట్ - మిగిలిన కంపెనీల ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే?