Flipkart Big Saving days 2023 : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ జులై 15 నుంచి 19 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. వర్షాకాలంలో పెడుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్లతో పాటు, ఆఫర్ల జల్లు కురిపిస్తామని స్పష్టం చేసింది.
భారీ తగ్గింపు!
Flipkart big saving days 2023 deals : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో స్మార్ట్ఫోన్లపై 43 శాతం వరకు, టీవీ అండ్ అప్లాయెన్సెస్పై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఫర్నీచర్‌పై 80 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు అందిస్తోంది. ఫ్యాషన్ దుస్తులు, వస్తువులపై 50% నుంచి 80% వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఇవే కాకుండా అదిరిపోయే బ్యాంక్ డిస్కౌంట్స్, ఆఫర్స్, డీల్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాంక్ డిస్కౌంట్స్!
Flipkart big saving days 2023 bank offers :
- యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
- ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే విధంగా ఈ కార్డుపై 16 శాతం వరకు సూపర్ కాయిన్స్‌ను కూడా పొందవచ్చు.
- ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ కింద ఒక్క లక్ష రూపాయల వరకు క్రెడిట్ పొందవచ్చు.
- పేటీఎం పేమెంట్స్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్‌పై కూడా మంచి సేవింగ్స్ పొందవచ్చు.
- బజాజ్ ఫిన్సెర్వ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఒక్క రోజు ముందుగానే!
Flipkart big saving days for plus members : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్‌కు ఒక రోజు ముందుగానే అంటే జులై 14 నుంచే ఈ బిగ్ సేవింగ్ డే సేల్ ప్రారంభమవుతుంది.
బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్!
Flipkart big saving days iPhone 13 offers : ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13ను రూ.20,999లకే అందుబాటులోకి తెచ్చింది. అందువల్ల మీరు అమెజాన్ ప్రైమ్ డే సేల్ వరకు ఆగవలసిన పనిలేదు. వాస్తవానికి 2021వ సంవత్సరంలో ఐఫోన్ 13ను రూ.79,900లకే మార్కెట్లోకి తేవడం జరిగింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దానిపై ఆఫర్లు అన్నింటితో కలిపి ఏకంగా రూ.58,901 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు నమ్మలేని సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.
Flipkart saving days smart phone offers 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై 43 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. సేల్ ప్రారంభానికి ముందు పూర్తి వివరాలు తెలుస్తాయి.
క్లియరెన్స్ సేల్ కూడా!
Flipkart big saving days clearance sale : ఈ సారి ఏసీ క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంటే వీటిపైన కూడా భారీగా ధర తగ్గే అవకాశం ఉంది.
తక్కువ ధరకే..!
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యూటీ, ఫుడ్, స్పోర్ట్స్ ఐటెమ్స్ రూ.99 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉండనున్నాయి. గృహోపకరణాలు, వంటగది సామానులు రూ.49 ప్రారంభ ధర నుంచే లభించనున్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్స్
Flipkart big saving days exchange offer : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో వస్తువులు కొనడం మాత్రమే కాదు. మన పాత ఫోన్లను కూడా అమ్మడానికి అవకాశం ఉంది. దీనితో మీ పాత ఫోన్లు సేల్‌లో ఉంచి గరిష్ఠంగా రూ.40,000 వరకు పొందవచ్చు.