ETV Bharat / business

ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి తప్పనిసరి! - fixed deposit interest calculator

Fixed Deposit Rates: సంప్రదాయ మదుపరులు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనే నమ్ముతుంటారు. కొన్నాళ్లుగా వీటిపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. కానీ, ఇప్పుడు మళ్లీ బ్యాంకులు ఈ వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నాల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేయాలనుకున్నప్పుడు కొన్ని విషయాలను పరిశీలించాలి.

Fixed Deposit Rates
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
author img

By

Published : Apr 2, 2022, 2:53 PM IST

Fixed Deposit Rates: ద్రవ్యోల్బణం పెరగడం, వచ్చే వారంలో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమావేశం ఉండటంలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకూ సవరించడం ప్రారంభించాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగొచ్చు. కాబట్టి, ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారు ఈ విషయాలను గమనించాలి. ఇప్పటికిప్పుడు దీర్ఘకాలిక వ్యవధికి కాకుండా.. స్వల్పకాలిక వ్యవధికి ఎఫ్‌డీ చేయడం మంచిది. వడ్డీ రేట్ల సవరణ పూర్తయ్యాక దీర్ఘకాలిక వ్యవధికి ఆ మొత్తాన్ని మళ్లించవచ్చు.

పన్ను భారం.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా బ్యాంకులు గరిష్ఠంగా 5.5శాతానికి మించి వడ్డీనివ్వడం లేదు. 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నవారికి, ఆదాయపు పన్ను, ద్రవ్యోల్బణాన్ని లెక్కించి చూస్తే.. ఎఫ్‌డీల వల్ల వచ్చే ప్రతిఫలం ఏమీ ఉండదు. ఇలాంటి వారు.. కేవలం పెట్టుబడి వృద్ధి కోసం చూడకుండా సురక్షితంగా ఉండేందుకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవాలి.

ప్రత్యేక డిపాజిట్లలో.. బ్యాంకులు ఇప్పుడు కొన్ని ప్రత్యేక డిపాజిట్లను వివిధ కాల వ్యవధులకు అందిస్తున్నాయి. 444, 650, 888 రోజులకు ఇవి ఉంటున్నాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే వీటికి కాస్త అధిక వడ్డీ లభిస్తోంది. కొన్ని రోజులు అధికంగా ఎఫ్‌డీని కొనసాగించడం వల్ల ఈ అదనపు వడ్డీ లాభాన్ని అందుకోవచ్చు. ఇలాంటప్పుడు మీ అవసరాలనూ చూసుకోవాలి. ముందే ఎఫ్‌డీని రద్దు చేసుకుంటే అపరాధ రుసుము ఉంటుంది.

వ్యవధి లేకుండా.. సాధారణంగా ఎఫ్‌డీలను నిర్ణీత కాలంపాటు కొనసాగించాలి. దీనికి బదులుగా స్వీప్‌-ఇన్‌ ఎఫ్‌డీలను బ్యాంకులు అందిస్తుంటాయి. వీటిని ఎంచుకున్నప్పుడు కావాల్సినప్పుడు నగదు వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులు పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీని అందిస్తాయి.

చిన్న బ్యాంకుల్లో.. పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను అతి తక్కువగా అందిస్తున్నాయి. కానీ, కొత్తతరం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఎఫ్‌డీల కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో చేసిన ఎఫ్‌డీలకూ రూ.5లక్షల వరకూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ లభిస్తుంది.

ఇదీ చదవండి: 'సిప్​' గురించి తెలుసా? నెలకు ఎంత మదుపు చేస్తే మంచిది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.